Vaibhav Suryavanshi : 10 సంవత్సరాలకే టెర్రస్‌పై వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రాక్టీస్.. వైరల్ అవుతున్న వీడియో
ప్రధానాంశాలు:
Vaibhav Suryavanshi : 10 సంవత్సరాలకే టెర్రస్‌పై వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రాక్టీస్.. వైరల్ అవుతున్న వీడియో
Vaibhav Suryavanshi : బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ప్రపంచంలో ఎంతగానో గుర్తింపు పొందాడు. క్రికెట్‌లో కెరీర్‌ను ఏర్పరచుకోవడానికి వైభవ్ సూర్యవంశీ ఇంత చిన్న వయస్సులోనే చదువు మానేశాడా.. అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

Vaibhav Suryavanshi : 10 సంవత్సరాలకే టెర్రస్‌పై వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రాక్టీస్.. వైరల్ అవుతున్న వీడియో
Vaibhav Suryavanshi అదరగొట్టేశాడు..
వైభవ్ సూర్యవంశీ చిన్న వయస్సులోనే తన కృషి, ప్రతిభతో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. భారత్ తరపున ఆడాలనేది వైభవ్ సూర్యవంశీ కల.. దీని కోసం అతను రాత్రి, పగలు కష్టపడి పనిచేస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీకి చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఆసక్తి ఉండేది. చాలా చిన్న వయస్సులోనే బ్యాటింగ్ మొదలుపెట్టాడు.
వైభవ్ సూర్యవంశీ తన చదువుతో పాటు క్రికెట్ ను కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాడు. వైభవ్ సూర్యవంశీ, అతని కుటుంబం చదువు, క్రీడల మధ్య సమతుల్యతను కాపాడుతోవడానికి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైభవ్ సూర్యవంశీ క్రికెట్ కెరీర్ చాలా అద్భుతంగా ఉంది. వైభవ్ సూర్యవంశీ అండర్-14, అండర్-16 స్థాయిలలో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ జట్టు దృష్టికి వచ్చే అవకాశాన్ని పొందాడు. లాక్‌డౌన్ సమయంలో ఇతను టెర్రస్ పైన ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 10 సంవత్సరాల వయస్సులో వీడియో ఇది కాగా, నాలుగు సంవత్సరాలకే ఐపీఎల్‌లో సెంచరీతో అదరగొట్టాడు.
A 10 yr old Vaibhav Sooryavanshi practicing on his terrace during the lockdown in 2021
4 years later, becomes the second fastest IPL centurion ❤️🙏#IPL2025 pic.twitter.com/fGdNMGyskA
— Vinesh Prabhu (@vlp1994) April 28, 2025
#vaibhavsuryavanshi at the age of 11 😯 pic.twitter.com/iRoo87Ir0R
— Richard Kettleborough (@RichKettle07) April 29, 2025