David Warner : ఐపీఎల్‌లో అమ్ముడు పోని డేవిడ్ వార్నర్.. తెలుగు సినిమాలో ఒక్క సినిమా కోసం అన్ని కోట్లా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

David Warner : ఐపీఎల్‌లో అమ్ముడు పోని డేవిడ్ వార్నర్.. తెలుగు సినిమాలో ఒక్క సినిమా కోసం అన్ని కోట్లా..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 March 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  David Warner : ఐపీఎల్‌లో అమ్ముడు పోని డేవిడ్ వార్నర్.. తెలుగు సినిమాలో ఒక్క సినిమా కోసం అన్ని కోట్లా..!

David Warner : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక క్రికెట‌ర్‌గా సత్తా చాటిన వార్న‌ర్ సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేసి అల‌రించాడు. ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో వార్నర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో భాగంగా నాలుగు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సినిమాలో నటించినందుకు డేవిడ్ వార్నర్ రూ.3 కోట్లు అందుకున్నాడట.

David Warner ఐపీఎల్‌లో అమ్ముడు పోని డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలో ఒక్క సినిమా కోసం అన్ని కోట్లా

David Warner : ఐపీఎల్‌లో అమ్ముడు పోని డేవిడ్ వార్నర్.. తెలుగు సినిమాలో ఒక్క సినిమా కోసం అన్ని కోట్లా..!

David Warner వార్న‌రా మ‌జాకానా?

ఇక సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు అదనంగా రూ.కోటి చార్జి చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయన అభిమానులు డేవిడ్ భాయ్ చాలా కాస్ట్లీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈసారి ఐపీఎల్ లో అమ్ముడుపోని ఆట‌గాళ్ల‌లో డేవిడ్ వార్న‌ర్ ఒక‌డు కాగా, వార్న‌ర్ క‌నీస ధ‌ర రూ.2 కోట్ల‌కు కొన‌డానికి ఒక్క ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు.

అయితే ఈసారి ఐపీఎల్ లో అమ్ముడుపోని ఆట‌గాళ్ల‌లో డేవిడ్ వార్న‌ర్ ఒక‌డు కాగా, వార్న‌ర్ క‌నీస ధ‌ర రూ.2 కోట్ల‌కు కొన‌డానికి ఒక్క ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. కాని రాబిన్ హుడ్ మూవీ మేకర్స్ తమ సినిమాలో నటించేందుకు ఒప్పించారు. నాలుగు రోజుల షూటింగ్ కు ఆయనకు రూ.3 కోట్లు చెల్లించారు. కాగా, ఈ నెల 28న రాబిన్‌హుడ్ రిలీజ్ కాబోతోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది