Minister Kishan Reddy : కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించేందుకు బీజేపీ హైకమాండ్ కసరత్తు.. కారణం ఇదేనా?
Minister Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, Minister Kishan Reddy, గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కింది స్థాయి నుంచి ఎదిగిన నేత. ఒక సాధారణ స్థాయి నేత నుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు కిషన్ రెడ్డి. తన కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న నేత ఆయన. అయితే.. 2018 ఎన్నికల్లో కిషన్ రెడ్డి అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం, Amber Peta Assembly Constituency, నుంచి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. కిషన్ రెడ్డికి సికింద్రాబాద్, Secunderabad, నుంచి ఎంపీ టికెట్ దక్కింది. దీంతో ఆయనకు ఏకంగా కేంద్ర మంత్రి పదవే దక్కింది. ఒకవేళ ఆయన ఎమ్మెల్యే అయి ఉంటే.. ఎంపీ టికెట్ వచ్చి ఉండేది కాదు..
కేంద్ర మంత్రి అయి ఉండేవారు కాదు. అయితే.. ఫస్ట్ నుంచి కూడా ఒకే పార్టీలో ఉండి.. కేవలం బీజేపీనే నమ్ముకొని ముందుకెళ్లారు కిషన్ రెడ్డి. ఆయన కష్టపడేతత్వం.. బీజేపీ హైకమాండ్ కు తెలుసు. బీజేపీ సీనియర్ లీడర్ వెంకయ్యనాయుడు శిష్యుడిగా ఆయనకు పేరున్న విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణలో మంచి పేరున్న కిషన్ రెడ్డిని తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితం చేయాలని హైకమాండ్ భావిస్తోందట. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడిప్పుడే బీజేపీ బలపడుతోంది. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే తెలంగాణలో మంచి పట్టు ఉన్న నేత కిషన్ రెడ్డి కావడంతో ఆయన్ను Telangana politics,తెలంగాణ రాజకీయాల్లో బిజీ చేయాలని భావిస్తోంది.
Minister Kishan Reddy : అంబర్ పేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం
అందుకే.. అంబర్ పేట,Amber Peta, నుంచి కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దాని కోసమే ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి.. అంబర్ పేట నుంచి పోటీ చేయించాలని దానికి తగ్గ ప్రణాళికలను బీజేపీ సిద్ధం చేస్తోందట. వచ్చే సంవత్సరం ఎలాగూ తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన్ను త్వరలోనే కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి.. తెలంగాణలో యాక్టివ్ కావాలని సూచించనున్నదట. అయితే.. కేంద్ర మంత్రి పదవి నుంచి కిషన్ రెడ్డిని తప్పించి అదే పదవిని మరో ఎంపీ లక్ష్మణ్ కు ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. బీజేపీ ఆలోచన ఏమేరకు సక్సెస్ అవుతుందో.