Minister Roja : మంత్రి రోజా చెప్పులు మోసిన ప్రభుత్వ అధికారి.. వీడియో వైరల్ !!
Minister Roja : ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా ఇటీవల బాపట్ల సూర్యలంక బీచ్ లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా బీచ్ లో కాసేపు జలకాలాటలాడారు. మంత్రి రోజాతో పాటు ప్రభుత్వ అధికారులు ఇంకా పలువురు రావడం జరిగింది. ఈ క్రమంలో ఆమె చెప్పులను పక్కన ఉన్న అధికారులు మోయటం జరిగింది. మేడం చెప్పులు జాగ్రత్త అని సదరు అధికారికి మంత్రి రోజా పిఏ చెప్పటం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మంత్రి రోజా అలల దగ్గర ఆడుకున్నంత సేపు ఆమె చెప్పులను మోసిన సదరు పర్యాటక శాఖ ఉద్యోగి… ఆమె బీచ్ నుండి బయటకు రాగానే అతడి దగ్గర నుండి చెప్పులను తీసేసుకోవడం జరిగింది. అయితే ఈ వీడియోస్ సోషల్ మీడియాలో రావడంతో మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో నెటిజెన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ అధికారితో చెప్పులు మోయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజల కోసం ఉద్యోగాలు చేసే ప్రభుత్వ అధికారులతో ఈ విధంగా వ్యవహరించటం వారిని అవమానపరచడం కింద లెక్కే వస్తుందని మరి కొంతమంది ఈ వీడియో పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Minister Roja is a government official wearing sandals Video viral
ఇటీవల మంత్రి రోజా టూరిజం డెవలప్మెంట్ విషయంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రదేశాలను పర్యటిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతాలను మరింత వెలుగులోకి తీసుకొచ్చే రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో మంత్రి రోజా పర్యటనలో.. ప్రభుత్వ అధికారులతో చెప్పులు మూయించటం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
