Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా నిత్యం వార్తలో నిలుస్తున్నారు. ఆమెకు సొంత పార్టీల ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఈసారి రోజా అనుచర వర్గం నుంచి ఓ మహిళ నేత బయటికి వచ్చి ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో 17వ వార్డు కౌన్సిలర్ గా భువనేశ్వరి అనే మహిళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వుడ్ కావడంతో భువనేశ్వరి చైర్మన్ పదవి కట్ట పెడతామని రోజా హామీ ఇచ్చారని భువనేశ్వరి ఆరోపిస్తున్నారు. మిగిలిన విషయాలను అన్న కుమారస్వామి తో మాట్లాడాలని చెప్పారని ఆమె అన్నారు.
వార్డ్ కౌన్సిలర్ భువనేశ్వరి చేస్తున్న ఆరోపణల ప్రకారం ఆమె మంత్రి రోజా అన్న కుమారస్వామిని కలిశారు. ముందుగా కుమారస్వామి మున్సిపల్ చైర్మన్ పదవికి 70 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య 40 లక్షలకు బేరం కుదిరింది. రెండు దఫాలలో కుదుర్చుకున్న మొత్తాన్ని కుమారస్వామికి భువనేశ్వరి అందించానన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగి మూడు సంవత్సరాలు కావస్తున్న రెండవ దఫా చైర్మన్ ఇస్తామని చెప్పిన మాట నేటికీ నెరవేర్చలేదని, అవకాశం ఇవ్వాలని పలు దఫాలు కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందని, ఈరోజు రేపు అంటూ చెబుతున్నారని భువనేశ్వరి అంటున్నారు. అయితే రోజా చైర్మన్ పదవిని ఎన్నికల తర్వాత కట్టబెడతామని మాయమాటలు చెబుతున్నారని భువనేశ్వరి తెలిపారు. ఎన్నికల తర్వాత మాకు అవసరం లేదని స్పష్టం చేశామని ఆమె తెలిపారు.
ఇప్పుడే మాకు అమౌంట్ ఇవ్వాలని అడిగినా స్పందన లేదన్నారు. రోజాకు మెసేజ్ చేసినా, కలిసినా స్పందన లేదన్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రిపై పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారని ప్రశ్నించారు. దళిత మహిళకు న్యాయం చేయాలని సీఎం జగనన్నను కోరుతున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈ విషయంపై మంత్రి రోజా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేనట్లుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి రోజాకు టికెట్ ఇస్తారా లేదా అనేది మరింత ఆసక్తికరంగా మారింది. నిజానికి రోజాకు సొంత నియోజకవర్గ అయినా నగరి నుంచి కూడా ఆమెకు వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలో ఆమెకు టికెట్ రావడం కష్టమే అని అంటున్నారు
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.