Roja : 40 లక్షల బేరం పై రోజా రియాక్షన్.. కావాలనే ఇలా చేస్తున్నారంటూ ఎమోషనల్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roja : 40 లక్షల బేరం పై రోజా రియాక్షన్.. కావాలనే ఇలా చేస్తున్నారంటూ ఎమోషనల్..!

Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా నిత్యం వార్తలో నిలుస్తున్నారు. ఆమెకు సొంత పార్టీల ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఈసారి రోజా అనుచర వర్గం నుంచి ఓ మహిళ నేత బయటికి వచ్చి ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో 17వ వార్డు కౌన్సిలర్ గా భువనేశ్వరి అనే మహిళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వుడ్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 January 2024,5:30 pm

ప్రధానాంశాలు:

  •  Roja : 40 లక్షల బేరం పై రోజా రియాక్షన్.. కావాలనే ఇలా చేస్తున్నారంటూ ఎమోషనల్..!

Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా నిత్యం వార్తలో నిలుస్తున్నారు. ఆమెకు సొంత పార్టీల ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఈసారి రోజా అనుచర వర్గం నుంచి ఓ మహిళ నేత బయటికి వచ్చి ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో 17వ వార్డు కౌన్సిలర్ గా భువనేశ్వరి అనే మహిళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వుడ్ కావడంతో భువనేశ్వరి చైర్మన్ పదవి కట్ట పెడతామని రోజా హామీ ఇచ్చారని భువనేశ్వరి ఆరోపిస్తున్నారు. మిగిలిన విషయాలను అన్న కుమారస్వామి తో మాట్లాడాలని చెప్పారని ఆమె అన్నారు.

వార్డ్ కౌన్సిలర్ భువనేశ్వరి చేస్తున్న ఆరోపణల ప్రకారం ఆమె మంత్రి రోజా అన్న కుమారస్వామిని కలిశారు. ముందుగా కుమారస్వామి మున్సిపల్ చైర్మన్ పదవికి 70 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య 40 లక్షలకు బేరం కుదిరింది. రెండు దఫాలలో కుదుర్చుకున్న మొత్తాన్ని కుమారస్వామికి భువనేశ్వరి అందించానన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగి మూడు సంవత్సరాలు కావస్తున్న రెండవ దఫా చైర్మన్ ఇస్తామని చెప్పిన మాట నేటికీ నెరవేర్చలేదని, అవకాశం ఇవ్వాలని పలు దఫాలు కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందని, ఈరోజు రేపు అంటూ చెబుతున్నారని భువనేశ్వరి అంటున్నారు. అయితే రోజా చైర్మన్ పదవిని ఎన్నికల తర్వాత కట్టబెడతామని మాయమాటలు చెబుతున్నారని భువనేశ్వరి తెలిపారు. ఎన్నికల తర్వాత మాకు అవసరం లేదని స్పష్టం చేశామని ఆమె తెలిపారు.

ఇప్పుడే మాకు అమౌంట్ ఇవ్వాలని అడిగినా స్పందన లేదన్నారు. రోజాకు మెసేజ్ చేసినా, కలిసినా స్పందన లేదన్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రిపై పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారని ప్రశ్నించారు. దళిత మహిళకు న్యాయం చేయాలని సీఎం జగనన్నను కోరుతున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈ విషయంపై మంత్రి రోజా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేనట్లుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి రోజాకు టికెట్ ఇస్తారా లేదా అనేది మరింత ఆసక్తికరంగా మారింది. నిజానికి రోజాకు సొంత నియోజకవర్గ అయినా నగరి నుంచి కూడా ఆమెకు వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలో ఆమెకు టికెట్ రావడం కష్టమే అని అంటున్నారు

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది