ఏపీ, తెలంగాణ గుడ్ న్యూస్… 3479 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Teacher jobs : కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ భారీ ఎత్తున టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
దేశ వ్యాప్తంగా మొత్తం స్కూల్స్ లో 3479 టీచర్ పోస్ట్ ల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో 262 పోస్టులు మరియు ఏపీలో 117 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్ 1వ తారీకున అప్లికేషన్ లు ప్రారంభం కాబోతున్నాయి. ఏప్రిల్ 30వ తారీకు చివరి తేదీ. ఈ జాబ్ లకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.
Teacher jobs : మొత్తం పోస్టులు- 3479
ministry of tribal affairs released notification for Teacher jobs
| తెలంగాణ | 262 |
| ఆంధ్రప్రదేశ్ | 117 |
| చత్తీస్‌గఢ్ | 514 |
| గుజరాత్ | 161 |
| హిమాచల్ ప్రదేశ్ | 8 |
| ఝార్ఖండ్ | 208 |
| జమ్మూ అండ్ కాశ్మీర్ | 14 |
| మధ్య ప్రదేశ్ | 1279 |
| మహారాష్ట్ర | 216 |
| మణిపూర్ | 40 |
| మిజోరం | 10 |
| ఒడిశా- | 144 |
| రాజస్తాన్ | 316 |
| సిక్కిం | 44 |
| త్రిపుర | 58 |
| ఉత్తర్ ప్రదేశ్ | 79 |
| ఉత్తరాఖండ్ | 9 |