Miriyala Rasam : మిరియాల రసం ఇలా చేశారంటే… గ్లాసులు గ్లాసులు లాగించేస్తారు…
Miriyala Rasam : వర్షాకాలం మొదలైందంటే జలుబు దగ్గులు మొదలైనట్టే వీటి నుంచి ఉపశమనం పొందడానికి టాబ్లెట్స్ వేసుకోవడం ఆవిరి పట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం అయితే దగ్గు జలుబు చేసినప్పుడు కొన్ని ఆహార నియమాలను కూడా పాటించాలి దీని ద్వారా దగ్గు జలుబును నియంత్రణలో నుంచి ఉపశమనం పొందవచ్చు. మిరియాల రసం చేసుకొని తాగితే దగ్గు జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు అయితే మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలి దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు : 1) మిరియాలు 2) జీలకర్ర 3) ధనియాలు 4) ఉప్పు 5) చింతపండు 6) ఉల్లిగడ్డ 7) టమాట 8) అల్లం 9) కరివేపాకు 10) ఎండు కొబ్బరి 11) ఎండుమిర్చి 12) మెంతులు 13) పసుపు 14) ఎల్లిపాయలు 14) ఆయిల్ 15) తాలింపు గింజలు తయారీ విధానం : ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 10 15 గ్రాముల చింతపండును తీసుకోవాలి. తర్వాత అందులో ఒక టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా పిసకాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి పది పదిహేను నిమిషాల పాటు ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో వన్ టీ స్పూన్ మిరియాలు, వన్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ మెంతులు, రెండు లేదా మూడు ఎండుమిర్చిలు నాలుగు వెల్లుల్లిపాయలు రెండు ఇంచుల కొబ్బరి, కొద్దిగా అల్లం తీసుకోవాలి. వీటన్నింటిని మిక్సీలో కానీ రోట్లో కానీ మెత్తగా దంచుకోవాలి.
ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు టమాట లను పిసికి 600 మిల్లీలీటర్ల వాటర్ ను పోసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు టమాటాలను పిసికి బయటపడేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా వేడి అయ్యాక వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలను వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా రంగు మారేవరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న రసం పొడిని వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో రసం వాటర్ ని కూడా పోసుకొని బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్ లో ఉంచి పదిహేను 20 నిమిషాల పాటు కొంగు వచ్చేవరకు ఉంచుకోవాలి. చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత ఇందులో ఒక కరివేపాకు రెమ్మ వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో టేస్టీ అయిన మిరియాల రసం రెడీ.