MLA Kethireddy ; సరోజమ్మ వద్దు…సరోజా వద్దు…కేతిరెడ్డి కామెడీకి అందరు నవ్వాల్సిందే వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

MLA Kethireddy ; సరోజమ్మ వద్దు…సరోజా వద్దు…కేతిరెడ్డి కామెడీకి అందరు నవ్వాల్సిందే వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :5 March 2023,9:00 am

MLA Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే ప్రతి ఉదయం నియోజకవర్గంలో నిర్వహించే “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మవరం నియోజకవర్గం లో రోజుకో ప్రాంతంలో… ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటిస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఉండే ప్రజా సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తూ ఉంటారు. కరెంట్ లేదా నీళ్లు ఇంకా పథకాలు ప్రభుత్వ పరిధిలో ఉండే అన్ని సమస్యల విషయంలో తనదైన శైలిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పరిష్కారం చూపిస్తారు.

MLA Kethireddy Hilarious Comedy In Village

MLA Kethireddy Hilarious Comedy In Village

ఇదిలా ఉంటే ఇటీవల ఓ అన్నదమ్ముల కి సంబంధించి… భూ వివాదం గొడవ ఎమ్మెల్యే కేతిరెడ్డి దృష్టికి రావడం జరిగింది. అయితే ఈ వ్యవహారం ఆ అన్నదమ్ములలో ఉండే ఒక భార్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆమె సమస్య చెబుతూనే… ఎమ్మెల్యే చెప్పేది వినకుండా సీరియస్ అయిపోతూ ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే..సరోజమ్మ వద్దు…సరోజా వద్దు… అన్న తరహాలో ఆమెతో కామెడీ చేయాల్సి వచ్చింది. దీంతో మిగతా సిబ్బంది అక్కడ ఉన్న వారంతా పగలబడి నవ్వారు. అది కుటుంబానికి సంబంధించిన ఆస్తి వ్యవహారం కావడంతో…

Anantapur: Tension erupts in Dharmavaram as Dalit groups protest against MLA's remarks on collector

తాను తల దూర్చలేనని స్పష్టం చేశారు. మేము వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళమే… అని అనటంతో గొడవ చేస్తూ ఉండటంతో ఇక నీ మాటలు వింటే నా వెంట్రుకలు మొత్తం ఊడిపోతాయని ఎమ్మెల్యే మరింతగా సెటైర్లు వేశారు. కుటుంబ గొడవకి పార్టీకి సంబంధం ఏముంటది. ఆ గొడవ తమ పరిధిలోకి రాదని ఎమ్మెల్యే ఎంత వారించిన ఆమె మాత్రం తెగ సీరియస్ అయిపోయింది. దీంతో నీ నోరుకి భయపడిపోయి అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆగమ్మా సరోజమ్మ అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి తన పని తను చూసుకుంటూ వెళ్ళిపోయారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది