Kethireddy Venkatarami Reddy : పెన్షన్ విషయంలో లంచం అడిగారని వెంటనే డాక్టర్ నీ సస్పెండ్ చేపించిన కేతిరెడ్డి వీడియో వైరల్..!!
Kethireddy Venkatarami Reddy : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికీ విపరీతమైన క్రేజ్ ఉంది. నిత్యం ప్రజలలో ఉండటంతో పాటు వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించటం కేతిరెడ్డి స్టైల్. ప్రజా సమస్యల విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే అక్కడికక్కడే చర్యలు తీసుకోవడం… వెంటనే సమస్యకి పరిష్కారం చూపించడం జరుగుద్ది. “గుడ్ మార్నింగ్ ధర్మవరం” పేరిట గత కొద్ది సంవత్సరాల నుండి.. కేతిరెడ్డి ప్రజలలో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ… పరిష్కారం చూపుతున్నారు.

MLA Kethireddy Venkatarami Reddy Suspend Doctor
దీనిలో భాగంగా కొంతమందిని సస్పెండ్ కూడా చేసిన ఘటనలు ఉన్నాయి. ఈ తరహాలోనే తాజాగా “గుడ్ మార్నింగ్ ధర్మవరం” పేరిట కేతిరెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్న క్రమంలో పెన్షన్ విషయంలో అనంతపురం ఆసుపత్రిలో ఓ వైద్యుడు లంచం అడిగినట్లు వృద్దులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే కేతిరెడ్డినీ అక్కడి సూపర్డెంట్ కి ఫోన్ చేసి.. లంచం అడిగిన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని లైవ్ లోనే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ వృద్ధులకు పెన్షన్ ఇప్పించే బాధ్యత కూడా కేజీరెడ్డి అప్పటికప్పుడే తీసుకుని…
సంబంధిత పరీక్షలకు ఏర్పాట్లు కూడా చేయటం హైలైట్. డాక్టర్ వంటి ఉన్నతమైన చదువులు చదివి ప్రజల దగ్గర లంచాలు అడగటం దారుణమని కేతిరెడ్డి మండిపడ్డారు. ఇటువంటి సంఘటనలు ఇటీవల ఎక్కువైపోతున్నాయని ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా ప్రజలు ఆసుపత్రికి వస్తే లంచాలు అడిగే వైద్యులు ఈమధ్య ఎక్కువే పోతున్నారు. సూపర్డెంట్ లు జాగ్రత్తగా ఉండాలని ఫోన్ ద్వారా ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరించారు.
