MLA Kethireddy : 1400 ఎకరాలు పొలం ఉన్న ఆమె పెన్షన్ అడిగింది.. ఎమ్మెల్యే కేతిరెడ్డి రియాక్షన్ అదుర్స్ వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

MLA Kethireddy : 1400 ఎకరాలు పొలం ఉన్న ఆమె పెన్షన్ అడిగింది.. ఎమ్మెల్యే కేతిరెడ్డి రియాక్షన్ అదుర్స్ వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :1 March 2023,5:00 pm

MLA Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉంటది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఆయా ప్రాంతాలలో పర్యటిస్తూ.. తన దృష్టికి వచ్చే ప్రతి సమస్యను ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్కడికక్కడే పరిష్కరిస్తూ ఉంటారు. ఈ రకంగానే ఓ ప్రాంతాలలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటిస్తున్న క్రమంలో… ఓ పెద్ద ఆవిడ వితంతువు తనకి పెన్షన్ రావడంలేదని

MLA Ketireddy reaction video goes viral

MLA Ketireddy reaction video goes viral

అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని తన సమస్య చెప్పుకుంది.ఈ క్రమంలో తనకి 1400 ఎకరాలు భూమి ఉందని రికార్డుల్లో తప్పుగా నమోదయిందని.. చెప్పటంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడ ఉన్న ప్రభుత్వ సిబ్బందిని మొత్తం చెక్ చేయాలని కోరారు. ఆ వెంటనే క్లియర్ చేసి ఆమెకు పెన్షన్ వచ్చే రీతిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు

Survey:Dharmavaram MLA Kethireddy Venkatarami Reddy Facing Tough Times?

రేషన్ విషయంలో కూడా వీఆర్వోకి సమస్యను వివరించి ఆమెకు రేషన్ వచ్చేలా ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్కడికక్కడే సమస్యను పరిష్కరించారు. ఒక్కసారిగా ఎమ్మెల్యే ఇచ్చిన మాటకు పెన్షన్ తో పాటు రేషన్ అందుకునే రీతిలో… చొరవ తీసుకోవటంతో ఆమె ఎంతగానో సంతోషించింది. ఈ క్రమంలో 1400 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు అన్న తరహాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి సరదాగా ఆమెతో కొంత సంభాషించడం అక్కడ అందరిని నవ్వులు పూయించింది.

YouTube video

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది