Roja : కొత్త జిల్లాతో మంత్రి పదవి.. ఆ ఉద్యమం వెనుక రోజా ఉందా?
Roja : ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సమయం లో కొన్ని కొత్త జిల్లాల ప్రతి పాదనలు వస్తున్నాయి. మరో వైపు మరిన్ని కొత్త జిల్లాల కోసం జనాలు ప్రజా సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించకుండా కొత్త జిల్లాలను ప్రకటించారు అంటూ కొందరు ఆందోళనలు చేస్తున్నారు. ఇదే సమయంలో నగరి నియోజకవర్గం కు చెందిన కొందరు యువజన సంఘం నాయకులు మరియు ప్రజా సంఘాల వారు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నగరి నియోజక వర్గం ను చిత్తూరు లో కంటిన్యూ చేస్తున్నారు. అలా కాకుండా తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా ను ఏర్పాటు చేసి అందులో నగరిని కలపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బాలాజీ జిల్లా కోసం ఆందోళన చేస్తున్న వారి వెనక ఎమ్మెల్యే రోజా ఉన్నారు అంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె రాజకీయ అవసరాల కోసం తన నియోజకవర్గం ను తిరుపతి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి కలపాలని డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఉంటే ఆమె ఎప్పటికీ మంత్రి అవ్వలేదు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో సీనియర్ నాయకుడు అయినా పెద్దిరెడ్డి ఉన్నాడు. కనుక ఆయనను కాదని లేదా ఆయనతో పాటు మంత్రి పదవి ఇవ్వడం అసాధ్యం. మళ్లీ వైకాపా అధికారంలోకి వచ్చిన సమయంలో మంత్రి పదవి దక్కాలి అంటే ఖచ్చితంగా కొత్త జిల్లాలో తన నియోజక వర్గం ఉండాలని రోజా భావిస్తన్నట్లుగా సమాచారం అందుతోంది.

mla roja fighting for new balaji district with nagari
కొత్త జిల్లాతో మంత్రి పదవి.. ఆ ఉద్యమం వెనుక రోజా ఉందా
Roja : కనుక ఆయన జిల్లా కాకుండా తనకు మరో జిల్లా ఉండటం వల్ల వేరే జిల్లా కోటాలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని భావిస్తుంది. అందుకే తన నియోజకవర్గమైన నగరి ని చిత్తూరు జిల్లాలో కాకుండా తిరుపతి జిల్లాలో కలపాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఆ డిమాండ్ నేరుగా తాను చేయకుండా వెనుక ఉండి నడిపిస్తుందని అంటున్నారు. తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లాలో ప్రకటించాలని అందులో నగరి నియోజకవర్గం ను చేర్చాలని యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్ రోజాకు కలిసి వచ్చే అవకాశం ఉంది కనుక ఆ ఆందోళనను ఎమ్మెల్యే రోజా చేస్తుంది అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అసలు విషయం ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి, చిత్తూరు జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న పెద్ద రెడ్డి కి మంత్రి పదవి దక్కడం వల్ల రోజా కు మంత్రి పదవి దక్కలేదు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. వైఎస్ జగన్ కి సన్నిహితులుగా పేరు దక్కించుకున్న పెద్ది రెడ్డి ని కాదని రోజాకి మంత్రి పదవి అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు కనుక మరో జిల్లాలో ఉంటే అప్పుడైనా రోజా కు మంత్రి పదవి వస్తుందేమో చూడాలి.