MLA Roja : రోజాకు ఇంటిపోరు.. మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారా..?
MLA Roja : రాజకీయాల్లో ప్రతిసారి అనుకూల పరిస్థితులు ఉండవు. ఎంత పెద్ద లీడర్ అయినా సరే.. కొన్ని సార్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయాలు అంటేనే వర్గపోరు కామన్. ఈ విషయంలో ఇప్పుడు ఎమ్మెల్యే రోజా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆమెకు బయటి పార్టీలో ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలియదు గానీ.. సొంత పార్టీలోనే చాలామంది ఆమెను టార్గెట్ చేస్తున్నారు. వాస్తవానికి జగన్‌ను అనునిత్యం పొగడ్తలతో ముంచెత్తే వారిలో ఆమె ముందుంటారు. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి మంత్రి కావాలని ఆశ పడుతున్నారు.
కాగా ఆమెకు మొదటి విడతలో ఆ అవకాశం దక్కలేదు. అయితే ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానేల నేపథ్యంలో ఆమె మరోసారి ఆశలు పెట్టుకుంటున్నారు. జగన్ సగం పాలన తర్వాత మంత్రి వర్గ మార్పు ఉంటుందని ముందే చెప్పారు కాబట్టి ఈసారి తనకు అవకాశం రాకపోదా అని ఆమె ఆశగా ఉన్నారు. అయితే వైసీపీలో ఆమె ఆశలకు చాలామంది గండికొడుతున్నట్టు సమాచారం. సొంత నియోజకవర్గంలోనే ఆమెకు వ్యతిరేక వర్గం బలంగా మారిపోయింది. పైగా వారికి జిల్లాలోని కీలక నేతల అండ కూడా ఉంది.దీంతో వారితో పోరాడటమే ఆమెకు ఇప్పుడు పెద్ద పని అయిపోయింది.
MLA Roja : ఎమ్మెల్యే టికెట్ రానివ్వరా..?
నగరిలో ఆమెకు వ్యతిరేకంగా ఓ పెద్ద వర్గం కాచుకుని కూర్చుంది. ఏ కొంచెం అవకాశం దొరికినా ఆమె సీటుకే ఎసరు పెట్టాలని చూస్తోంది. కాగా పెద్ద లీడర్లు వారి వెంట ఉన్నారనే అనుమానంతో రోజా కూడా చాలాసర్లు అసహనం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు ఆమెకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారంట ఆ వర్గం. అంతే కాకుండా రాబోయే ఎన్నికల్లో ఆమెకు ఎమ్మెల్యే టికెట్ దక్కనివ్వొద్దని చాలామంది ప్రయత్నిస్తున్నారంట. కాబట్టి రోజా ఇప్పటి నుంచే అలెర్ట్ అయితేనే బెటర్ అని చెబుతున్నారు చాలామంది. మరి ఆమె మంత్రి పదవి ఆశలను నిలబెట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి.