MLA Roja : ఎమ్మెల్యే రోజాకి డేంజర్ బెల్స్.. జగన్ చేతిలో లేటెస్ట్ రిపోర్ట్..!!
MLA Roja : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే. వై నాట్ 175 అనే లక్ష్యంతో జగన్ టార్గెట్ పెట్టుకొని వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు నేతలతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గాలలో సర్వేలు చేయిస్తూ.. నేతల పనితీరు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో సరిగ్గా పనిచేయని నేతలకు క్లాస్ తీసుకుని మరో అవకాశం కల్పిస్తున్నారు.
అయితే ఎంత చెప్పినా మార్పు రాకపోతే ప్రజలలో వ్యతిరేకత ఉంటే టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ ఇటీవల పార్టీ నేతల సమావేశంలో హెచ్చరించడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు రోజా నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు తేలిందట. 2014, 2019 ఎన్నికలలో రోజా వరుసగా నగరి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి కూడా సంపాదించారు. అయితే ఇప్పుడు సొంత నియోజకవర్గం వైసీపీ పార్టీకి చెందిన నాయకులే రోజాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. సొంత పార్టీ నేతలే ఈ రకంగా వ్యవహరించటం విషయంపై గతంలో ఈ విషయాన్ని జగన్ దృష్టి దాక కూడా తీసుకెళ్లడం జరిగింది.
అయితే త్వరలో సీఎం జగన్ నగరిలో పర్యటించబోతున్నారు. ఈనెల 28వ తారీకు నగరి నియోజకవర్గానికి రాబోతున్నారు. జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో నగరి అభ్యర్థిగా రోజా గెలుపు బాధ్యతలపై సీఎం పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉందని సమాచారం. లేటెస్ట్ నగరి నియోజకవర్గంలో చేసిన సర్వేలో..కూడా రోజా కి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు పనిచేస్తున్నట్లు తేలిందట. మరి ఈ విషయంలో జగన్ ఏ రకంగా నగరి పర్యటనలో స్పందిస్తారన్నది ఉత్కంఠ భరితంగా మారింది.