MLA Roja : జబర్దస్త్ లో మళ్లీ సందడి చేసిన రోజా.. అయ్యో పాపం మంత్రి పదవి లేనట్లేనా..?
MLA Roja : 2019 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఆ సమయంలో రోజా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసినట్లే అంటూ ప్రతి ఒక్కరు భావించారు. కానీ సామాజిక సమీకరణాల పేరుతో రోజాని సీఎం జగన్ పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆమెకు ఏదో ఒక పదవి కట్ట బెట్టిన కూడా ఆమె పూర్తి స్థాయి సంతృప్తి లో లేదనే ప్రచారం జరిగింది. ఆ విషయం పక్కన పెడితే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రోజా జబర్దస్త్ ని కంటిన్యూ చేసి మొన్నటి వరకు కూడా షూటింగ్లో పాల్గొంటూ నే ఉంది.
జబర్దస్త్ ఆమె కు అత్యంత కీలకమైన కార్యక్రమంగా చెబుతూ ఉంటుంది. ఇక మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యం లో గత రెండు మూడు వారాలుగా రోజా తాడేపల్లి గూడెం లోనే చక్కర్లు కొడుతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్ లో ఆమె కనిపించక పోవడంతో మంత్రి వర్గంలో దాదాపుగా ఆమె బెర్త్ ఖాయం అయినట్లే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని అనూహ్యంగా ఆమె తాజా ఎపిసోడ్లను కనిపించడంతో ఆమె మంత్రి పదవి ఆశలు గల్లంతు అయ్యాయా.. దాంతో మళ్ళీ జబర్దస్త్ కు వచ్చిందా అంటూ చర్చ మొదలైంది. ఎమ్మెల్యే రోజా అనూహ్యంగా మళ్ళీ జబర్దస్త్ లో కనిపించడంతో పాపం ఆమె కి మంత్రి పదవి దక్కలేదు ఏమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు మాత్రం మంత్రి పదవి లేకుంటే రోజా జబర్దస్త్ లో కొనసాగుతారు. అది ఖచ్చితంగా కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. కనుక మంత్రి పదవి రాక పోవడం మంచిది అంటూ జబర్దస్త్ అభిమానులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ కోసం ఆమె కు మంత్రి పదవి రాకుండా ఉండాలని కోరుకుంటున్నారు. మొత్తానికి జబర్దస్త్ మరియు ప్రభుత్వం ని రోజా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తుందా లేదా మంత్రి పదవి విషయం లో క్లారిటీ వచ్చేంత వరకు జబర్దస్త్ కొనసాగుతుందా అనేది చూడాలి. రోజాకి మంత్రి పదవి వస్తే కచ్చితంగా జబర్దస్త్ ను వదిలేయబోతుంది అనేది మాత్రం క్లారిటీ ఉంది. రోజా కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ నెల 11 వ తారీకున అన్ని విషయాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.