Vallabhaneni Vamsi : చంద్రబాబు బార్య భువనేశ్వరికి క్షమాపణలు చెప్పిన వల్లభనేని వంశీ…!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అంటేనే చాలా హాట్… రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక అంశంపై రాష్ట్రంలో పాలిటిక్స్ రగడ కొనసాగుతూనే ఉంటాయి. ఇటీవల అసెంబ్లీలో మాజీ సీఎం చంద్రబాబు బార్య భువనేశ్వరిపై చేసి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అసెంబ్లీలో కొడాలి నాని, వల్లభనేని వంశా టీడీపీ అధినేత నేత చంద్రబాబు సతీమణీపై ఘటైన వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లారు.
ఈ విషయంపై నేడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భువనేశ్వరికి క్షమాపణలు తెలిపారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై ఎమోషన్ లో ఒక పదం తప్పుగా దొర్లిన మాట వాస్తవమని అంగీకసిస్తూ ఈ రోజు వంశీ క్షమాపణలు చెప్పారు. నేను భువనేశ్వరి గారిని అక్కా అని పిలుస్తా అని కూడా అన్నారు.

MLA vallabhaneni vamsi apologized to nara bhuvaneswari
Vallabhaneni Vamsi భువనేశ్వరికి క్షమాపణలు చెప్పిన వల్లభనేని వంశీ
టీడీపీలో ఆత్మీయులు ఎవరైనా ఉన్నారంటే అది భువనేశ్వరి అక్కా మాత్రమే అని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా క్షమాపణ తెలుపుతూ తప్పు జరిగినందుకు పశ్చాత్తాప పడుతున్నానని తెలిపారు. నా నుంచి ఇంకోసారి ఇలాంటి తప్పు దొర్లదు. నా ఆత్మ సాక్షిగా క్షమాపణ చెబుతున్నానని వంశీ అన్నారు.