MLC Jeevan Reddy : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సహాయకుడు గంగారెడ్డి దారుణ హత్య
MLC Jeevan Reddy : జగిత్యాల రూరల్ మండలం జబితాపూర్‌లో మంగళవారం తెల్లవారుజామున కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ టీ. జీవన్‌రెడ్డి సన్నిహితుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58)ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. నిందితులు గంగారెడ్డి బైక్‌ను వెనుక నుంచి కారుతో ఢీకొట్టి, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో గంగారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. గంగారెడ్డి మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. […]
MLC Jeevan Reddy : జగిత్యాల రూరల్ మండలం జబితాపూర్‌లో మంగళవారం తెల్లవారుజామున కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ టీ. జీవన్‌రెడ్డి సన్నిహితుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58)ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. నిందితులు గంగారెడ్డి బైక్‌ను వెనుక నుంచి కారుతో ఢీకొట్టి, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో గంగారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. గంగారెడ్డి మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల-ధర్మపురి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.తన సోదరుడిని కోల్పోయానని చెప్పిన జీవన్ రెడ్డి పక్కా ప్లాన్‌తో గంగారెడ్డిని దుండగులు హత్య చేశారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాలో కాంగ్రెస్ నాయకులకు భద్రత లేదని, జగిత్యాలలో బీఆర్‌ఎస్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బైపాస్ రోడ్డు మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. భూవివాదాలు, రాజకీయ వైషమ్యాలే హత్యకు కారణమా అనే విషయంపై స్పష్టత రాలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంతో పాటు జగిత్యాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.