Modi : రైతులకు కేంద్రం శుభవార్త.. ఈసారి బడ్జెట్ లో వ్యవసాయ రుణం పరిమితి పెంపు !
Modi : కేంద్రం ప్రభుత్వం రైతులకు ఓ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు గాను వచ్చే 2022 -23 బడ్జెట్ లో ప్రభుత్వం వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 18 లక్షల కోట్లకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల అనగా ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు ఉండగా… కేంద్రం ప్రతీ ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని పెంచుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఆ లక్ష్యాన్ని రూ. 18 నుంచి 18.5 లక్షల కోట్లకు పెంచవచ్చని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. జనవరి నెలాఖరుకు దీనిపై ఓ స్పష్టత రానుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా.. వార్షిక వ్యవసాయ రుణ లక్ష్యాన్ని నిర్దేశిస్తుండగా…
ఇందులో పంట రుణాల లక్ష్యంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ వస్తోంది. ఈ మేరకు రైతుల అభివృద్దే ధ్యేయంగా రుణ పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. నిన్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాల్లో పడ్డ సంతోషంలో ఉన్న రైతులకు ఇప్పుడు మరో మంచి వార్త అందిందనే చెప్పాలి.