Modi : ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇక నుంచి నెలకు రూ.4,500!
Modi : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. కోవిడ్ 19 కారణంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ పొందలేకపోయిన వారికి మరో అవకాశాన్ని కల్పించింది. పిల్లల రిజల్ట్ లేదా రిపోర్ట్ కార్డ్ లేదా ఫీజు చెల్లింపు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ వంటి వాటిని ప్రింట్ తీసుకొని సమర్పిచడం ద్వారా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.
అయితే ఇది మార్చి 2020 నుంచి మార్చి 2021 వరకు అకడమిక్ ఇయర్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇక దీని ద్వారా 7వ వేతన సంఘం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలకు రూ.2,250 చిల్ట్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ పొందే అవకాశం ఉంది. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఈ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దానిపై రూ.4,500 వరకు పొందే అవకాశం ఉంది. పిల్లల చదువు కోసం కేంద్రం.. తన ఉద్యోగులకు అలవెన్స్ అందిస్తోంది.
అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉద్యోగులు… చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. స్కూళ్ళు మూత పడటంతో అందుకు సంబంధించిన సర్టిఫికేట్ రాక పోవడంతో అలవెన్స్ ను క్లెయిమ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయింది. కేంద్రం తాజా ప్రకటనతో ఇప్పుడు ఆయా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఊరట కలిగిందనే చెప్పాలి.