Modi : అంతర్జాతీయ ప్రయాణికులపై మరిన్ని ఆంక్షలు.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రప్రభుత్వం..
Central Govt : దేశంలో గత మూడు రోజులుగా కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతుండటం చూసి ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసులు మరిన్ని పెరగకుండా ఉండేందుకుగాను కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారా కరోనా కేసులు మరింతగా పెరిగే చాన్సెస్ ఉన్న నేపథ్యంలో వారిపై మరిన్ని ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ ఇకపై వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు హోం క్వారంటైన్ నిబంధనలపై సమాచారం కూడా ఇచ్చింది కేంద్రం.

central govt key decision on international passengers
Central Govt : వారు ఇక వారం రోజుల పాటు హోం ఐసొలేషన్‌లోనే..
దేశంలో రోజురోజుకూ కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బాగా పెరుగుతున్నాయని వార్తల ద్వారా తెలుస్తోంది. కాగా, చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే కొవిడ్ కేసులు తగ్గించేందుకుగాను నైట్ కర్ఫ్యూలతో పాటు వీకెండ్ లాక్ డౌన్లు విధిస్తున్నాయి.
COVID19 | All international arrivals to undergo 7-day mandatory home quarantine: Government of India pic.twitter.com/XR7nHcmr9T
— ANI (@ANI) January 7, 2022