Money Tips : ఏడాదిలోనే.. రూ.లక్షతో రూ.10 లక్షల లాభం..
Money Tips : ఏ నిముషంలో ఏమీ జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.. స్టాక్ మార్కెట్ లో ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఆలోచించి పెట్టుబడి పెడితే ఎంత మొత్తంలో లాభం వస్తుందో.. అంతే ఎక్కువగా నష్టం సైతం వస్తుంది. కానీ కొంత మందికి అనుకోకుండా కలిసి వస్తుంది. ఎదో తోచిన దానిపై పెడితే ఆ షేర్ విలువ కొన్ని సార్లు అమాంతం పెరిగిపోతుంది. ఎక్కువ లాభం రావాలంటే దీర్ఘకాలికంగా వేచి ఉండక తప్పదు. కొన్ని సందర్భాల్లో కొన్ని షేర్లు అనుహ్యంగా లాభాలను తెచ్చిపెడతాయి. కానీ ఇలాంటివి అందరికీ సాధ్యం కావు.
ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఆలోచించి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు.షేర్ మార్కెట్‌లో మల్టీ బ్యాగర్ షేర్లు ఉంటాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడి పొందవచ్చు. ఇలాంటి షేర్లను గుర్తించడం చాలా కష్టమనే చెప్పాలి. ముందుగానే అంచనా వేసి డబ్బులు పెడితే మంచి లాభం వస్తుంది. ఇలాంటి వాటిల్లో జీఆర్ఎం ఓవర్సీస్ సైతం ఉంది. ఈ షేరు 2004 అక్టోబర్ 1న కేవలం 10 పైసలు. కానీ దాని విలువ ప్రస్తుతం రూ.590కు చేరుకుంది. అంటే ఏకంగా 5,90,350 శాతం పెరిగిందన్న మాట.
Money Tips : లాభం ఏంతంటే..?
ఈ షేరులో డబ్బులు పెట్టిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. గత ఐదేళ్ల కాలంలో రూ.6.2 నుంచి రూ.590కు ర్యాలీ చేసింది. అంటే 9,400 శాతం పెరిగింది. ఏడాది కిందట ఈ షేరు ధర రూ.52 ఉండేది. ఆరు నెలల కిందట రూ.167 వద్ద కొనసాగింది. కానీ ఇప్పుడు రూ.590కు చేరుకుంది. ఇలా షేరు ధర క్రమంగా పెరుగుతూనే వస్తోంది. ఈ షెర్‌పై 2004లో రూ.లక్ష పెట్టుబడి పెడితే వాటి విలువ ప్రస్తుతం రూ.59 కోట్లకు చేరుకునేది. ఇలాంటి షేర్లను గుర్తించడం చాలా కష్టం.