Stock Market : లాభాల్లో ప్రారంభ‌మైనా అమ్మ‌కాల ఒత్తిడితో ప‌డుతున్న స్టాక్ మార్కెట్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Stock Market : లాభాల్లో ప్రారంభ‌మైనా అమ్మ‌కాల ఒత్తిడితో ప‌డుతున్న స్టాక్ మార్కెట్లు

 Authored By ramu | The Telugu News | Updated on :21 November 2024,10:35 am

ప్రధానాంశాలు:

  •  Stock Market : లాభాల్లో ప్రారంభ‌మైనా అమ్మ‌కాల ఒత్తిడితో ప‌డుతున్న స్టాక్ మార్కెట్లు

Stock Market : భార‌త స్టాక్ మార్కెట్లు గురువారం ఉద‌యం లాభాల‌తో సానుకూలంగా ప్రారంభమైన తర్వాత ప్రతికూల స్థాయికి జారుకుని అమ్మ‌కాల ఒత్తిడి పెరుగ‌డంతో ప‌డుతుంది. నిఫ్టీ 50 ఇండెక్స్ 64.70 పాయింట్ల (0.28 శాతం) లాభంతో 23,518.50 పాయింట్ల వద్ద ప్రారంభమవ్వగా, బీఎస్ఈ సెన్సెక్స్ కూడా 132.73 పాయింట్ల (0.17 శాతం) పెరుగుదలతో 77,711.11 పాయింట్ల వద్ద ప్రారంభమైనప్పుడు లాభపడింది. ఇటీవ‌లి కాలంలో స్టాక్ మార్కెట్లు వ‌రుస‌గా ప‌త‌నం అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే భారతీయ మార్కెట్లు సమీప కాలంలో రాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత వచ్చే వారం మార్కెట్లలో కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

బ్యాంకింగ్ మరియు మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గా మాట్లాడుతూ.. ఎన్‌విడియా ఫలితాలు, ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ క్షిపణులను ప్ర‌యోగించ‌డం మరియు యుఎస్ కోర్టులో అదానీ ఆరోపణలు నేడు మార్కెట్‌లను శాసిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఉదయం ఆసియా మార్కెట్లు స్థంభంగా ఉన్నాయి. నేటి ట్రేడింగ్‌లో భారతీయ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా ఉంటాయని తాము భావిస్తున్న‌ట్లు తెలిపారు. మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్‌ రాష్ట్ర ఎన్నికల ఫలితాలతో, శనివారం అధికార కూటమి గెలిస్తే స్టాక్ మార్కెట్ల‌కు కొంత మద్దతు దొరుకుతుంద‌ని చెప్పారు.

Stock Market లాభాల్లో ప్రారంభ‌మైనా అమ్మ‌కాల ఒత్తిడితో ప‌డుతున్న స్టాక్ మార్కెట్లు

Stock Market : లాభాల్లో ప్రారంభ‌మైనా అమ్మ‌కాల ఒత్తిడితో ప‌డుతున్న స్టాక్ మార్కెట్లు

నిఫ్టీ 50 జాబితాలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ మరియు అదానీ పోర్ట్స్ టాప్ లూజర్‌లుగా ప్రారంభమయ్యాయి. రెండు సూచీలు లోయర్ సర్క్యూట్‌కు దాదాపు 10 శాతం క్షీణించాయి. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ లంచం కేసులో US ప్రాసిక్యూటర్లు గౌతమ్ అదానీ మరియు ఇతరులపై అభియోగాలు మోపడంతో అదానీ గ్రీన్ షేర్లు కూడా లోయర్ సర్క్యూట్‌లో 18 శాతం క్షీణించాయి. ఈ విషయంపై అదానీ గ్రూప్ స్పందిస్తూ, “ఈ పరిణామాల దృష్ట్యా మా అనుబంధ సంస్థలు ప్రస్తుతం ప్రతిపాదిత USD డినామినేటెడ్ బాండ్ ఆఫర్‌లను కొనసాగించకూడదని నిర్ణయించుకున్న‌ట్లు ఎక్స్ఛేంజీకి తెలియజేసింది.

గురువారం ఇతర ఆసియా మార్కెట్లలో, చాలా ప్రధాన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. జపాన్‌కు చెందిన నిక్కీ 225 సూచీ స్వల్పంగా 0.84 శాతం క్షీణించగా, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ సూచీ కూడా 0.19 శాతం క్షీణించింది. దక్షిణ కొరియా మరియు జకార్తా కాంపోజిట్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. బుధవారం US మార్కెట్లు దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. S&P 500 ఇండెక్స్ మరియు నాస్‌డాక్ ఇండెక్స్ రెండూ స్థిరంగా ఉన్నాయి. Selling pressure drags the Stock market in red , Selling pressure drags the market, Sensex, Nifty, trading, share market today, share market ,

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది