Monkey : ఓ వ్య‌క్తి నుండి రూ.500 నోట్ల క‌ట్ట తీసుకెళ్లి చెల్లాచెదురుగా ప‌డేసిన కోతి.. వైర‌ల్ వీడియో

 Authored By ramu | The Telugu News | Updated on :16 June 2025,3:38 pm

ప్రధానాంశాలు:

  •  Monkey : ఓ వ్య‌క్తి నుండి రూ.500 నోట్ల క‌ట్ట తీసుకెళ్లి చెల్లాచెదురుగా ప‌డేసిన కోతి

Monkey : ఈ మ‌ధ్య కోతుల ఆగ‌డాలు చాలా ఎక్కువ‌య్యాయి.తాజాగా తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పర్యటకుల నుంచి ఓ కోతి ఏకంగా రూ. 500 నోట్ల కట్టను లాక్కెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొడైకెనాల్‌లోని గుణ గుహ‌ సందర్శన‌కు వచ్చిన క‌ర్ణాట‌కకు చెందిన‌ కొందరు పర్యటకుల చేతిలో ఉన్న రూ. 500 నోట్ల కట్టను ఓ కోతి అమాంతం లాగేసుకుంది.

Monkey : ఓ వ్య‌క్తి నుండి రూ.500 నోట్ల క‌ట్ట తీసుకెళ్లి చెల్లాచెదురుగా ప‌డేసిన కోతి.. వైర‌ల్ వీడియో

Monkey : ఓ వ్య‌క్తి నుండి రూ.500 నోట్ల క‌ట్ట తీసుకెళ్లి చెల్లాచెదురుగా ప‌డేసిన కోతి.. వైర‌ల్ వీడియో

Monkey : ఇదేం ప‌ని..

అంతటితో ఆగకుండా ఆ నోట్లతో చెట్టు ఎక్కి ఆడుకోవడం మొద‌లుపెట్టింది. వాటిని గాల్లోకి విసిరేయడం చేసింది. ఈ దృశ్యాల‌ను అక్క‌డ ఉన్న‌వారు త‌మ మొబైల్ ఫోన్ల‌లో వీడియో తీసి, సోష‌ల్ మీడియాలో పెట్టారు. దాంతో వీడియో వైర‌ల్‌గా మారింది. ఇలాంటి ఘటనలు మన దేశంలో కొత్తేమీ కాదు. గతంలో మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే తరహాలో ఓ సంఘటన జరిగింది.

అక్కడ ఓ ఆటో ప్రయాణికుడి నుంచి ఏకంగా లక్ష రూపాయల నగదును ఓ కోతి లాక్కెళ్లింది. ఆ తర్వాత ఓ చెట్టెక్కి నోట్లను కిందకు విసిరేయడంతో వాటిని ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు. సాధారణంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు కోతులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటాయి. పర్యటకులు, స్థానికులు వాటికి ఆహారం అందించడం వల్ల అవి మనుషులకు బాగా అలవాటుపడి, వారి నుంచి వస్తువులు లాక్కోవడానికి కూడా వెనుకాడటం లేదని వన్యప్రాణి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి