Viral Video : ఈ కోతి చేసే దొంగతనాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. మామూలుగా లేదుగా..
Viral video : కోతులంటే సహజంగా తినడానికి ఏం కనిపిస్తే వాటిని ఎత్తుకెళ్తుంటాయి. మనుషుల నుంచి ఆహారాన్ని లాక్కెళ్తు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పకుబోయే కోతి వీటన్నింటికి డిఫరెంట్.. అది అసలు ఆహారం జోలికి వెళ్లదు. మంచి ప్లాన్ తో రంగంలోకి దిగుతుంది. ఎదురుగా ఎవరున్నా సరే కొంచెం కూడా భయపడదు. ప్లాన్ ను తప్పనిసరిగా అమలు చేసి తీరుతుంది. మనుషులకు తెలియకుండానే వారిని ఫాలో అవుతుంది. కన్నులు మూసి తెరిచేలోపు తన పని కానిచ్చేస్తుంది. ఇలా చాలామంది ఈ కోతి చేతిలో బుక్కయ్యారు. ఇంతకు ఆ కోతి ఏం చేస్తుంది. తెలుసుకుందామా..
మనిషి తర్వాత జంతువుల్లో తెలివైనవి కోతులు. అల్లరికి, తిక్క వేశాలకు ఇవి పెట్టింది పేరు. ఇక గుడికి, కొండలపైకి వెళ్లినప్పుడు అక్కడున్న కోతులకు పండ్లు, కొబ్బరి చిప్పలు ఇస్తుంటాం. వాటితోనే అవి సరిపెట్టుకుంటాయి. కొన్ని కోతులు మాత్రం పర్యాటకుల చేతులోంచి ఆహారాన్ని లాక్కెళ్తుంటాయి. కానీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్.. సిమ్లాలోని రిడ్జ్ మాల్ రోడ్డులో ఓ కోతి చాలా డిఫరెంట్. ఇది ఆహారాన్ని పట్టుకుపోదు. కానీ వస్తువులను దొంగతం చేస్తుంది. దాని చుట్టూ వెళ్తున్న వారి కళ్లజోళ్లను ఎత్తుకుపోతుంది.

Viral Video a monkey stealing eye glasses
Viral video : డిఫరెంట్‌గా దొంగతనాలు..
ఇక కళ్లజోడు మనకు తిరిగి రావాలంటే దానికి ఆహారం పొట్లం ఇవ్వాల్సిందే. ఇలా ఓ మహిళ ఫోన్ మాట్లాడుకుంటూ ఆ కోతి ముందు నుంచి వెళ్తుంది. ఆమెను గమనించి కోతి వెనకాల నుంచి ఒక్కసారి ఆమెపై దూకి ఆమె కళ్లజోడును తీసుకుని రేకులు షెడ్ పైకి ఎక్కింది. దీనిని గమనించిన ఓ వ్యక్తి దానిని ఆహారపు పొట్లం ఇవ్వడంతో అది అద్దాలను తిరిగి ఇచ్చేంది. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్స్ కోతి తెలివితేటలకు ఫిదా అవుతున్నారు. దానిని పొగుడుతూ కామెంట్ చేయకుండా ఉండలేకపోతున్నారు.
Cute crook! A monkey in India carefully plans and steals eyeglass from passerby and returns it for food! They are evolving folks! pic.twitter.com/EulPyxdqHz
— Channa Prakash (@AgBioWorld) March 1, 2022