Viral Video : వాహ్వా.. హాయిగా బుల్లి సైకిల్ తొక్కుతున్న కోతి.. ఎక్కడికి వెళ్తుందంటే?
Viral Video : మనుషులు కోతుల నుంచి వచ్చారని, హోమో సెపియన్స్ అని సైన్స్ పాఠాల్లో అందరం చదువుకునే ఉంటాం. ఇక ఇప్పుడు కూడా ఎవరైనా ఏదేని చిలిపి పని చేసినా కోతి చేష్టలు మానుకో అని పెద్దలు హెచ్చరిస్తుంటారు కూడా. కాగా, అలా కోతి పనులు చేయడం పిల్లలకు అయితే అలవాటుగానే ఉండిపోతుంటుంది. ఈ సంగతులు అలా ఉంచితే.. ఓ కోతి చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.
సోషల్ మీడియాలో వైరలవుతున్న సదరు వీడియోలో కోతి చక్కగా సైకిల్ తొక్కడం మనం చూడొచ్చు. లవ్ లీ యానిమల్స్ లవ్ లీ అనే ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ వేదికగా షేర్ అయిన వీడియోలో మంకీ సరదాగా బుల్లి సైకిల్ ను చాలా స్పీడుగా తొక్కేయడం మనం చూడొచ్చు. అలా కోతి సైకిల్ ను చాలా వేగంగా తొక్కుతూనే ఉంది.కోతి అలానే ముందుకు వెళ్తుండటం చూస్తే మనకు ఆనందం వేస్తుంటుంది కూడా.

monkey cycling video viral in social media
Viral Video : అలా రోడ్డుపైన సరదాగా స్పీడుగా సైక్లింగ్ చేస్తున్న మంకీ..
ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోతి ఎంచక్కా హాయిగా అలా ముందుకు సాగుతున్నదని అంటున్నారు. వెరీ ఫన్నీ మంకీ .. అని కామెంట్స్ కూడా చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అయితే, మంకీ ఇలా ఫిజికల్ ఎక్సర్ సైజెస్ చేస్తోందేమో అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram