Viral Video : చెట్టు కింద నిద్రిస్తున్న పులిని ఆట ఆడేసుకున్న ఓ కోతి… వైరల్ అవుతున్న వీడియో… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : చెట్టు కింద నిద్రిస్తున్న పులిని ఆట ఆడేసుకున్న ఓ కోతి… వైరల్ అవుతున్న వీడియో…

 Authored By aruna | The Telugu News | Updated on :4 September 2022,8:00 am

Viral Video : సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా అనిపిస్తాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అయితే ఈ వీడియోలో ఓ కోతి నిద్రిస్తున్న పులిని ఓ ఆట ఆడేసుకుంది. భూమిపై జీవించే ఎన్నో జీవరాశులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాయి. అడవిలో అయితే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. తమ మనుగడ కోసం కొన్నిసార్లు తీవ్రంగా పోరాడాల్సి వస్తుంది. అక్కడ పై చేయి సాధించిన వారు రాజ్యమేలుతారు. ఇలాంటి జంతువులు అడవిలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చిరుత, పులి, సింహం లాంటివి ఉంటాయి. తన తెలివితేటలు, సామర్థ్యం, ధైర్యం వలన సింహం అడవికి రాజు అయ్యింది..

పులి కూడా సింహానికి ఏమాత్రం తీసుకుపోదు. తన జోలికి ఏ జంతువైన వస్తే తన పంజాతో తన సత్తా ఏంటో చూపిస్తుంది. అయినప్పటికీ కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీటిని చూసేందుకు నేటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వీడియోలో ఒక కోతి చెట్టుకొమ్మను పట్టుకొని ఊగుతూ ఉంటుంది. ఆ చెట్టుకింద కొన్ని పులులు విశ్రాంతి తీసుకుంటున్నాయి. అయితే చెట్టుపై వేలాడుతున్న కోతి కింద ఉన్న పులిని కొట్టడం, తోక పట్టుకొని లాగడం వంటి చేష్టలకు పాల్పడుతుంది.

Viral Video monkey plays the games with tiger

Viral Video monkey plays the games with tiger

కోతిని పట్టుకుందామని పులులు ప్రయత్నిస్తే అది వెంటనే చెట్టు ఎక్కేస్తుంది. ఏమి చేయలేక పులులు పక్కన ఉన్న చెట్టు పొదల్లోకి వెళ్లిపోతాయి. అయినా కోతి తన చిలిపి పనులను ఆపలేదు. అక్కడికి కూడా వచ్చి పులి చెవి, తోక పట్టుకుని లాగుతుంది. ఇలా చాలాసేపు కోతి పులిని చిరాకు పెడుతూనే ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కోతికి ఇవన్నీ అవసరమా అని అందుకే కోతి చేష్టలు అని అంటారు అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోని ఇప్పటికే మూడు లక్షల మంది పైగా చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by ???? IFELINES ~ (@feline.unity)

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది