Monkey : ఓ వ్యక్తి నుండి రూ.500 నోట్ల కట్ట తీసుకెళ్లి చెల్లాచెదురుగా పడేసిన కోతి.. వైరల్ వీడియో
Monkey : ఈ మధ్య కోతుల ఆగడాలు చాలా ఎక్కువయ్యాయి.తాజాగా తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పర్యటకుల నుంచి ఓ కోతి ఏకంగా రూ. 500 నోట్ల కట్టను లాక్కెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొడైకెనాల్‌లోని గుణ గుహ సందర్శనకు వచ్చిన కర్ణాటకకు చెందిన కొందరు పర్యటకుల చేతిలో ఉన్న రూ. 500 నోట్ల కట్టను ఓ కోతి అమాంతం లాగేసుకుంది.
Monkey : ఓ వ్యక్తి నుండి రూ.500 నోట్ల కట్ట తీసుకెళ్లి చెల్లాచెదురుగా పడేసిన కోతి.. వైరల్ వీడియో
అంతటితో ఆగకుండా ఆ నోట్లతో చెట్టు ఎక్కి ఆడుకోవడం మొదలుపెట్టింది. వాటిని గాల్లోకి విసిరేయడం చేసింది. ఈ దృశ్యాలను అక్కడ ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో వీడియో వైరల్‌గా మారింది. ఇలాంటి ఘటనలు మన దేశంలో కొత్తేమీ కాదు. గతంలో మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే తరహాలో ఓ సంఘటన జరిగింది.
అక్కడ ఓ ఆటో ప్రయాణికుడి నుంచి ఏకంగా లక్ష రూపాయల నగదును ఓ కోతి లాక్కెళ్లింది. ఆ తర్వాత ఓ చెట్టెక్కి నోట్లను కిందకు విసిరేయడంతో వాటిని ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు. సాధారణంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు కోతులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటాయి. పర్యటకులు, స్థానికులు వాటికి ఆహారం అందించడం వల్ల అవి మనుషులకు బాగా అలవాటుపడి, వారి నుంచి వస్తువులు లాక్కోవడానికి కూడా వెనుకాడటం లేదని వన్యప్రాణి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.