Harish Rao : కేసీఆర్ సభ కోసం ఎక్కువ కాంగ్రెస్ నేతల్లో ఆత్రుత.. హరీష్ రావు
Harish Rao : బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ (BRS Silver Jubilee Sabha) నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)మాట్లాడుతూ, కేసీఆర్ రేపు చేసే ప్రసంగం కోసం కాంగ్రెస్ నేతలు ఎక్కువగా ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. “కేసీఆర్ ఏం మాట్లాడతాడో తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకులకు (Congress leaders) టెన్షన్ మొదలైంది. కానీ వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే” అంటూ హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రసంగం రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారితీశాయి. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను హైడ్రా అధికారులు రాత్రికి రాత్రే తొలగించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కాసేపటికే అధికారులు తొలగించటంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోనూ బీఆర్ఎస్ ఫ్లెక్సీలను డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీసివేశారు.

Harish Rao : కేసీఆర్ సభ కోసం ఎక్కువ కాంగ్రెస్ నేతల్లో ఆత్రుత.. హరీష్ రావు
ఫ్లెక్సీల తొలగింపుపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారుల ఎదుటే ధర్నాకు దిగారు. రాజకీయ వేడి నేపథ్యంలో ఫ్లెక్సీల తొలగింపు మరింత వివాదాస్పదంగా మారింది. కార్యకర్తలు దీనిని ప్రజాస్వామ్య పరిపాటికి విరుద్ధంగా పేర్కొంటూ అధికారుల చర్యలను ఖండించారు. ఈ పరిణామాలు రేపు జరగనున్న కేసీఆర్ సభకు మరింత ప్రాధాన్యతను చేకూర్చుతున్నాయి.