Viral News : ఇంట్లో త‌ల్లి శ‌వం.. గుడిలో పెళ్లి చేసుకున్న కొడుకు.. ఎందుకంటే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral News : ఇంట్లో త‌ల్లి శ‌వం.. గుడిలో పెళ్లి చేసుకున్న కొడుకు.. ఎందుకంటే

 Authored By mallesh | The Telugu News | Updated on :13 July 2022,6:00 pm

Viral News : పెళ్లంటే నూరేళ్ల పంట అంటుంటారు పెద్ద‌లు. అందుకే పెళ్లి విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ప‌విత్ర బంధంగా భావిస్తారు. అందుకే ప‌ట్టువ‌స్త్రాలు, ఆభ‌ర‌ణాలు.. పెళ్లి పందిరీ ఇలా సాంప్ర‌దాయ బ‌ద్దంగా చేసుకుంటారు. అలాగే ఇంట్లో ఎవ‌రైనా చ‌నిపోతే వివాహం సంవ‌త్స‌రం వ‌ర‌కు జ‌రిపించ‌రు. ఒక వేళ అమ్మ‌యి పెళ్లి అయితే సంవ‌త్స‌రం లోపు చేస్తారు. అయితే పెళ్లంటే ఇంటి నిండా బంధువులు ఫ్రెండ్స్ తో సంద‌డిగా ఉంటుంది. కానీ ఓ వ్య‌క్తి ఇంట్లో త‌ల్లి శ‌వాన్ని పెట్టుకుని టెంపుల్ లో వివాహం చేసుకున్నాడు. కార‌ణం త‌న త‌ల్లి చివ‌రి కోరిక అని.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అయితే ఝార్ఖండ్​ కి చెందిన ఓం కుమార్​కు, సరోజ్​ అనే యువతితో కొన్ని రోజులు క్రితమే వివాహం నిశ్చయించారు. వీరి పెళ్లి ఈ నెల‌10న చేయాలని ఇరు కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే కొద్ది రోజులుగా ఓం కుమార్ తల్లి అనారోగ్య‌తో బాధ‌ప‌డుతోంది. అయితే త‌న త‌ల్లి చివ‌రి కోరిక ఓం కుమార్ పెళ్లి చేసుకోవ‌డం. అయితే ఈ కోరిక తీర‌కుండానే ఓం కుమార్ త‌ల్లి ఆరోగ్యం విషమించి గురువారం అర్ద‌రాత్రి ప్రైవేట్ హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతూ చ‌నిపోయింది. అయితే త‌న త‌ల్లి చివ‌రి కోరిక తీర్చ‌డానికి ఓం కుమార్ ఏ కొడుకు చేయ‌లేని ప‌ని చేశాడు.

mothers corpse at home son married in temple because

mothers corpse at home son married in temple because

దీంతో త‌న తల్లి శవాన్ని ఇంట్లో ఉంచి.. ఓం కుమార్​ దగ్గరలోని శివాలయంలో సరోజ్​ను వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యాక ఓం కుమార్ దంప‌తులు తల్లి కాళ్లకు న‌మ‌స్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ త‌ర్వాతే అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న వారిని క‌ల‌చివేసింది. త‌ల్లి కోరిక‌ను ఈ విధంగానైనా తీర్చాడ‌ని అంటున్నారు. కాగా సోషల్ మీడియా ద్వారా ఈ పెళ్లి గురించి వైరల్ అయింది. ఓం కుమార్ ని కొంద‌రు ప్ర‌శంసిస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది