Vijayasai Reddy : ఫార్మ్ లోకి వచ్చేసిన సాయన్న .. వైసీపీ క్యాడర్ ఖుషీ ఖుషీ !

Advertisement

Vijayasai Reddy : వైసీపీలో కీలక నేతగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. అవును.. గత కొన్ని రోజుల నుంచి విజయసాయిరెడ్డి అంత యాక్టివ్ గా లేరు. నిజానికి విజయసాయిరెడ్డి ప్రత్యర్థులపై తనదైన స్టయిల్ లో విరుచుకుపడతారు. కానీ.. ఎందుకో కొన్ని నెలల నుంచి ఆయన ప్రత్యర్థుల విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఇక ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా. అందుకే విజయసాయిరెడ్డి మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. చాలా రోజుల తర్వాత ట్వీట్టర్ వార్ ప్రారంభించారు.

Advertisement
MP Vijayasai Reddy who is a key leader in YCP has become active again
MP Vijayasai Reddy who is a key leader in YCP has become active again

టీడీపీపై ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శల వర్షం కురిపించారు. తాజాగా చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే కదా. దానిపై ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరును ప్రస్తావించకుండా మేనిఫెస్టోపై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు.. తన మేనిఫెస్టోకు భవిష్యత్తుకు గ్యారెంటీ అనే పేరు పెట్టిన విషయం తెలుసు కదా. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ తన మేనిఫెస్టోను ప్రకటించారు చంద్రబాబు. చంద్రబాబుది మామూలు మేనిఫెస్టో కాదు. అది మాయాఫెస్టో. ఆయన మాయాఫెస్టోలో ఎవరు పడతారు.

Advertisement
MP Vijayasai Reddy who is a key leader in YCP has become active again
MP Vijayasai Reddy who is a key leader in YCP has become active again

Vijayasai Reddy : ఈయన మాయాఫెస్టోలో ఎవరు పడతారు?

అవన్నీ ఉత్త హామీలు. అమలు చేయమంటారేమోనని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోనే మాయం చేశారు. ఇలాంటి మాయాఫెస్టోలను చూసి ఓట్లేస్తారా అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు విజయసాయిరెడ్డి. ఆయన ఇక ట్విట్టర్ లో యాక్టివ్ కావడంతో ఇక వైసీపీ నేతలు కూడా ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఇక ప్రత్యర్థులకు చుక్కలే. ఎలాంటి వాళ్లను అయినా వైసీపీపై ఎలాంటి విమర్శలు చేసినా వెంటనే విజయసాయిరెడ్డి వాళ్లపై సీరియస్ గా కౌంటర్లు ఇస్తుంటారు. ఇక ఆయన యాక్టివ్ కావడంతో వైసీపీ క్యాడర్ ఫుల్ ఖుషీ అయిపోయింది. ఆయన ఇలాగే ఫామ్ లో ఉంటే వైసీపీని టచ్ చేయడానికి కూడా ప్రత్యర్థులు వణకాల్సిందే అంటున్నారు వైసీపీ అభిమానులు.

Advertisement
Advertisement