Crime News : 20 నెలల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన కామాంధుడు.. చిన్న పిల్ల అని కూడా చూడకుండా క్రూరంగా చేశాడు..!!
Crime News : చిన్న పిల్లలు, అమ్మాయిలు, మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఇప్పటికే దేశంలో చాలా చట్టాలు వచ్చాయి. కానీ.. ఆ చట్టాలేవీ ఇలాంటి దారుణాలను ఆపలేకపోతున్నాయి. దేశ రాజదాని ఢిల్లీలో నిర్భయ.. హైదరాబాద్ లో దిశ.. ఇవన్నీ మనకు తెలిసినవి.. తెలియని దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి. రోజూ ఎందరో చిన్నారులు, మహిళలు కామాంధులకు బలవుతున్నారు.
తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. 20 నెలల చిన్నారిపై ఓ ప్రబుద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. సెంట్రల్ ముంబైలో నివసించే ఓ ఫ్యామిలీ ఇంటి పక్కనే 35 ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు. చాలా రోజుల నుంచి ఆ చిన్నారిపై కన్నేసిన ఆ వ్యక్తి.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అతి దారుణంగా ప్రవర్తించాడు.
Crime News : పాప ఏడుపు వల్ల అసలు విషయం వెలుగులోకి
ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులను చూసి పాప ఏడుపు మొదలు పెట్టింది. తీవ్రంగా ఏడుస్తూ ఉండటంతో ఏమైందని ఆరా తీయగా.. పక్కింటి వ్యక్తి చేసిన చేష్టలను ఆ పాప చెప్పింది. దీంతో వెంటనే పాప తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు… అతడిని అదుపులోకి తీసుకొని అతడిపై కేసు నమోదు చేసి పాపను వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం లేపింది.