Mustard Seeds | ఆవాల అద్భుత గుణాలు.. ఆరోగ్యానికి, అందానికి అపూర్వమైన వరం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mustard Seeds | ఆవాల అద్భుత గుణాలు.. ఆరోగ్యానికి, అందానికి అపూర్వమైన వరం!

 Authored By sandeep | The Telugu News | Updated on :30 October 2025,8:15 am

Mustard Seeds | మన వంటింట్లో సాధారణంగా ఉండే ఆవాలు (Mustard Seeds) కేవలం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చిన్న గింజలుగా కనిపించే ఆవాలు అసలైన పోషక నిధి.ఆవాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసి, శరీరానికి అవసరమైన “మంచి కొవ్వులు” పెంచుతాయి.

#image_title

ఎన్నో ఉప‌యోగాలు..

అలాగే క్యాన్సర్‌ నిరోధక గుణాలు కూడా ఆవాల్లో ఉన్నాయి. ఆవపిండిలో ఉండే సెలీనియం సమ్మేళనం శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం, దగ్గు వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.ఇదే కాకుండా, ఆవాల్లో ఉన్న డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు భోజనంలో కొద్దిగా ఆవపిండిని చేర్చుకోవచ్చు. అలాగే ఇందులోని పొటాషియం, కాల్షియం ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఆవాలు కేవలం ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా మిత్రం. ఇందులోని రిచ్ న్యూట్రియెంట్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి, జుట్టును బలంగా, మెత్తగా మారుస్తాయి. విటమిన్ A, K, మరియు సల్ఫర్ వంటి పోషకాలు చర్మంపై ముడతలు, వయస్సు లక్షణాలు తగ్గించడంలో సహాయపడతాయి.ఇక ఆవపిండిలోని యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మంపై మొటిమలు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి. సోరియాసిస్, రింగ్ వార్మ్ వంటి చర్మ సమస్యలకు కూడా ఆవాలు ఉపశమనం ఇస్తాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది