Mustard Seeds : ఆవాలలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే… తినకుండా అస్సలు ఉండలేరు…!!
ప్రధానాంశాలు:
Mustard Seeds : ఆవాలలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే... తినకుండా అస్సలు ఉండలేరు...!!
Mustard Seeds : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో అతి ముఖ్యమైనవి ఆవాలు. అయితే వీటిని ప్రతి రోజు ప్రతి వంటలలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే మనం ఈ ఆవాలను తీసుకోవటం వలన దగ్గు మరియు జలుబు లాంటి సమస్యలు దూరం అవుతాయి. అలాగే ఈ ఆవాలను నిత్యం తప్పనిసరిగా తీసుకోవడం వలన జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు అని నిపుణులు అంటున్నారు. అంతేకాక ఈ ఆవాలలో పొటాషియం మరియు కాల్షియం కూడా అధికంగా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఎముకల ఆరోగ్యానికి మరియు కీళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి…
ఈ ఆవాలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈ ఆవాలను తీసుకోవటం వలన బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. అలాగే శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటన్నిటి కారణం చేత ఇన్ ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. అలాగే ఈ ఆవాలలో సెలీనియం కూడా అధికంగా ఉంటుంది. అంతేకాక ఈ ఆవాలను తీసుకోవడం వలన థైరాయిడ్ పనితీరు కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఇది థైరాయిడ్ జీవ క్రియకు ఎంతో హెల్ప్ చేస్తుంది. కావున మీరు ఆవాలు మరియు ఆవపిండి, ఆవనూనె ను కచ్చితంగా మీ డేట్ లో చేర్చుకోండి…
ఆవాలలో ఉన్న కొన్ని గుణాలు క్యాన్సర్ పెరగకుండా చూస్తుంది. దీనివలన మనల్ని మనం కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షించుకోవచ్చు. అలాగే ఈ ఆవాల్లో రీచ్ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇవి మీ చర్మాన్ని మెరిసేలా చేయటమే కాకుండా జుట్టుకు కూడా ఎంతో బలాన్ని ఇస్తుంది. అయితే ఆవాలలో విటమిన్ ఏ సి కే లు కూడా ఉంటాయి. అయితే ఇవి వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు మరియు ఏజింగ్ లక్షణాలను నయం చేస్తాయి. అలాగే ఆవాల్లో పినోలిక్ కాంపౌండ్స్ మరియు టోకోఫెరోల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. అంతేకాక వీటిలో ఉన్న గుణాలు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి కాలేయ పనితీరు మెరుగుపరుస్తుంది. వీటితో పాటు జీర్ణ సమస్యలను కూడా నయం చేస్తుంది…