MLA Roja : ఎమ్మెల్యే రోజా వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తోందా? తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన రోజా.. ఏమన్నారో తెలుసా?

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: February 7, 2022, 4:30 pm

MLA Roja : వైసీపీ ఎమ్మెల్యే రోజా.. తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారా? ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. అసలు.. వైసీపీ పార్టీకి రోజా రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది.. అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చర్చలు కూడా పెట్టారు. కానీ.. ఇటీవల శ్రీశైలం ఆలయ పాలకమండలిని ఏపీ ప్రభుత్వం ఖరారు చేయడం వల్ల.. ఆ పాలకమండలిలో ఉన్న సభ్యుల విషయమై రోజా అలకబూనినట్లు వార్తలు వచ్చాయి.దీంతో తను త్వరలో తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. మీడియా కూడా కోడై కూసింది. త్వరలోనే వేరే పార్టీకి రోజా వెళ్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

దీంతో తన అభిమానులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.తనపై వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే రోజానే స్వయంగా రంగంలోకి దిగింది. తనపై వస్తున్నవన్నీ వట్టి పుకార్లే అని కొట్టి పారేసింది. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని.. వైసీపీకి కూడా రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతున్నానని సోషల్ మీడియాలో, కొన్ని మీడియాలలో వార్తలు వస్తున్నాయి. అవన్నీ పుకార్లు అంటుంది రోజా.నేను ఎప్పటికీ వైసీపీలోనే ఉంటాను. నన్ను రెండు సార్లు నగరి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. అందుకే నగరిలోనే ఇల్లు కట్టుకొని ఉంటున్నాను.

nagari ysrcp mla roja gives clarity on changing party

nagari ysrcp mla roja gives clarity on changing party

MLA Roja : స్వయంగా రోజానే రంగంలోకి దిగి రూమర్లకు చెక్

నా జీవితం మొత్తం నగరి ప్రజల కోసమే. నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన సీఎం జగన్ కు రుణపడి ఉంటా అని రోజా చెప్పుకొచ్చారు.నాకు స్థానికంగా ఎటువంటి రాజకీయ ఇబ్బందులు లేవు. నేను ఏంటో జగన్ మోహన్ రెడ్డికి తెలుసు. కావాలని.. నా మీద ఆరోపణలు చేస్తున్నారు. నా ప్రత్యర్థి వర్గాలు కావాలని ఆరోపణలు చేసి.. రాజకీయ లబ్ధి పొందుతున్నారు.. అవన్నీ అబద్ధ ప్రచారాలు.. దయచేసి వాటిని నమ్మకండి.. అని రోజా స్పష్టం చేశారు.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp