Manmadhudu : మన్మథుడు హీరోయిన్ అన్షు గుర్తుందా? ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే నోరెళ్లబెడతారు?
Manmadhudu : నాకు కాఫీ నచ్చదు.. తాగితేనే కదా.. నచ్చుతుందో లేదో తెలిసేది.. ఈ డైలాగ్ గుర్తుందా? ఎక్కడో విన్నట్టు ఉంది కదా. అవును.. మన్మథుడు సినిమాలోని అన్షు హీరోయిన్ గుర్తుందా? ఆమె అందానికి అప్పట్లో అందరూ ఫిదా అయిపోయారు. నాగార్జున మన్మథుడు సినిమాలో అలా కనిపించి.. మరో రెండు మూడు సినిమాల్లో మాత్రమే నటించి.. ఆ తర్వాత వెండి తెరకే దూరం అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తన పేరు అన్షు. అయితే.. అన్షు అంటే ఎవ్వరూ గుర్తుపట్టరు కానీ.. మన్మథుడు హీరోయిన్ అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. 2002 లో తను సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 2005 లో ఇండస్ట్రీకి దూరమై పోయింది. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్లింది? ఎవరిని పెళ్లి చేసుకుంది? ఎక్కడ ఉంటుంది? అనే విషయాలు మాత్రం ఎవ్వరికీ తెలియదు.

nagarjuna manmadhudu heroine anshu tollywood news
అయితే.. ఈ మధ్య తన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తను సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటుంది. అలాగే.. తన పర్సనల్ విషయాలను, తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో అన్షు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయిపోతోంది.

nagarjuna manmadhudu heroine anshu tollywood news
Manmadhudu : లండన్ లో సెటిల్ అయిన అన్షూ
అయితే.. అన్షూ.. వెండి తెరకు దూరం అయ్యాక.. లండన్ కు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అక్కడే సెటిల్ అయిపోయింది. తనకు ఇప్పుడు ఒక బాబు, ఒక పాప. లండన్ లో సెటిల్ అవ్వడమే కాదు.. అక్కడే ఫ్యాషన్ డిజైనర్ గా తను వర్క్ చేస్తోంది. అయితే.. ఇప్పటికీ తనకు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఆసక్తి మాత్రం తగ్గలేదట. అందుకే.. సినిమా ఇండస్ట్రీలో తన సెకండ్ కెరీర్ ను ప్రారంభించాలని యోచిస్తోందట. త్వరలోనే టాలీవుడ్ లో ఆమె అడుగు పెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే.. అన్షూ.. ఏ సినిమాలో ఎంట్రీ ఇస్తుందో మాత్రం తెలియదు. కానీ.. అన్షూ అభిమానులు మాత్రం తన రీఎంట్రీ కోసం బాగానే ఎదురు చూస్తున్నారు. చూద్దాం మరి.. తను ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందో?

nagarjuna manmadhudu heroine anshu tollywood news