నాగార్జున సాగర్ ఉపఎన్నికపై బిగ్ అప్ డేట్.. ఆ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక జరిగింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. మొత్తం మీద తెలంగాణలో ఎప్పుడూ ఎన్నికల హడావుడే ఉంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరగనుంది. ఓవైపు ఏపీలో తిరుపతి ఉపఎన్నిక జరగనుంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ సెప్టెంబర్ లో మరణించారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కూడా అకాల మృతి చెందడంతో అక్కడా ఎన్నిక అనివార్యమైంది.
సో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఉపఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరం మార్చి నెలలో తిరుపతి, నాగార్జున సాగర్ ఉపఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నదట.
సో.. బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలకు ఒకేసారి రెండు నియోజకవర్గాల మీద.. దృష్టి పెట్టాల్సి వస్తోంది. సాగర్ తో పాటు తిరుపతి ఉపఎన్నికపై బీజేపీ అయితే ఫుల్లు ఫోకస్ పెట్టింది.
సాగర్ లో ఇప్పటికే ప్రధాన పార్టీలు పాగా వేశాయి. ఏ అభ్యర్థిని నిలపాలా? అంటూ ప్రణాళికలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి జానారెడ్డికి కొడుకు బరిలో దిగుతారంటూ టాక్ వస్తోంది. టీఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్ దక్కుతుందో మాత్రం ఇంకా తెలియట్లేదు.
అయితే.. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి చెందిన టీఆర్ఎస్ పార్టీకి నాగార్జున సాగర్ ఎన్నికలు చాలెంజింగ్ గా కనిపిస్తున్నాయి. అందుకే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి త్వరలోనే అభివృద్ధికి సంబంధించిన నిధులు కేటాయించి అప్పుడు బరిలో దిగి గెలవాలన్నది టీఆర్ఎస్ ప్లాన్. చూద్దాం.. ఈసారి సాగర్ ఉపఎన్నిక ఎన్ని మలుపులు తిరుగుతుందో?