Sagar by poll : సాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి కన్ఫమ్..? చివరకు ఆయనకే టికెట్?
Sagar by poll : ప్రస్తుతం తెలంగాణలో సాగర్ ఉపఎన్నిక గురించే చర్చ. ఎక్కడ చూసినా నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అనే దానిపై జోరుగా మాట్లాడుకుంటున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో అనూహ్యంగా బీజేపీ గెలవడంతో కనీసం ఈ ఉపఎన్నికల్లో అయినా అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా? లేక వేరే పార్టీ సాగర్ లో పాగా వేస్తుందా? అనే విషయంపై క్లారిటీ లేదు.
ఏది ఏమైనా… సాగర్ ఉపఎన్నికల్లో గెలిచి తమ సత్తాను చాటాలన్న కసిలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. తాజాగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణం వల్ల వస్తున్న ఉపఎన్నిక కావడంతో… టీఆర్ఎస్ పార్టీ ఉపఎన్నికల్లో నర్సింహయ్య కొడుకు నోముల భగత్ కే టికెట్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అఫిషియల్ గా నోముల భగత్ పేరును త్వరలోనే టీఆర్ఎస్ అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
దుబ్బాకలో కూడా సోలిపేట చనిపోవడంతో ఆయన భార్యకు కేసీఆర్ అవకాశం కల్పించారు కానీ… ఆ ఎన్నికల్లో సానుభూతి వర్కవుట్ కాలేదు. ఆమె ఓడిపోయారు. అయినా కూడా సాగర్ లోనూ సానుభూతి వర్కవుట్ అవుతుందనే ఆశతో మరోసారి ఈ నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
Sagar by poll : సాగర్ టికెట్ కోసం ఆరుగురు టీఆర్ఎస్ నేతల ప్రయత్నాలు
అయితే… సాగర్ టికెట్ కోసం… సాగర్ కు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ నేతలు హైకమాండ్ తో చర్చలు జరిపారు కానీ… అది వర్కవుట్ కాలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డి, కోటిరెడ్డి, రంజిత్ యాదవ్, రవీందర్ రెడ్డి.. ఇలా చాలామందే సాగర్ ఉపఎన్నిక టికెట్ మీద ఆశలు పెట్టుకున్నప్పటికీ.. చివరకు హైకమాండ్… నోముల కొడుకువైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచార బాధ్యతలను మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించారు. దీంతో సాగర్ లోనే మకాం వేసిన జగదీశ్ రెడ్డి.. సాగర్ లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని ఢీకొట్టాలంటే సాగర్ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై మంచి అభిప్రాయం కలిగేలా చేయాలి. దాని కోసమే టీఆర్ఎస్ పార్టీ పక్కాగా ప్రణాళికలను రచిస్తోంది. అభ్యర్థి విషయంలోనూ ఆచీ తూచీ అడుగులు వేస్తోంది.