Nara Lokesh : సొంత తండ్రినే లోకేశ్ లైట్ తీసుకున్నాడు.. చంద్రబాబు పని అయిపోయిందని లోకేశ్ కు అర్థమయిపోయిందా?
Nara Lokesh : నారా లోకేశ్.. టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకుగానే కాకుండా.. రాజకీయాల్లో బిగ్ ఫెయిల్యూర్ అయిన నేతగానూ ఏపీలో అందరికీ సుపరిచితమే. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో నారా లోకేశ్ గెలిచింది లేదు. ఆయన్ను ప్రజలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలిపించలేదు. అందులోనూ నారా లోకేశ్ చేసే చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపుతూ.. మిగితా పార్టీల నాయకులు.. అసలు లోకేశ్ రాజకీయాలకు పనికిరారు.. అంటూ ఎద్దేవా చేస్తుంటారు.
అయితే.. 2019 ఎన్నికల వరకు నారా లోకేశ్ చాలా హుషారుగా ఉండేవారు. తన మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా.. తను మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్లేవారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేవారు. అయితే.. గత కొన్ని రోజుల నుంచి నారా లోకేశ్ ఎందుకో.. తన తండ్రి చంద్రబాబును, టీడీపీ పార్టీని లోకేశ్ పట్టించుకోవడం మానేశారట.
ఉదాహరణకు కుప్పం నియోజకవర్గాన్నే తీసుకుంటే.. అది చంద్రబాబు నియోజకవర్గం. అక్కడ చంద్రబాబు కొన్ని దశాబ్దాల నుంచి గెలుస్తూ వస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఎలాగైనా వైసీపీ జెండాను ఎగురవేయాలని వైసీపీ తెగ ఆరాటపడుతోంది. అందుకే.. కుప్పాన్ని.. మంత్రి పెద్దిరెడ్డికి సీఎం జగన్ అప్పజెప్పారు. దీంతో కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి.. అక్కడ టీడీపీని నామరూపం లేకుండా చేసేందుకు పెద్దిరెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. నారా లోకేశ్ మాత్రం తనకేమీ పట్టదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.
Nara Lokesh : చంద్రబాబును డైరెక్ట్ గా టార్గెట్ చేసిన పెద్దిరెడ్డి
ఓ వైపు ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. అయినా కూడా నారా లోకేశ్ పట్టించుకోవడం లేదు. ఒకవేళ తన తండ్రి చంద్రబాబు పని అయిపోయిందని.. టీడీపీ కాలం చెల్లిపోయిందని నారా లోకేశ్ కు ముందే అర్థమయిందా? అందుకే సేఫ్ జోన్ లో ఉంటున్నారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.