Chiranjeevi : చిరంజీవిని రాజకీయాల్లోకి లాగిన నారాయణ.! ఆ అక్కసుతోనేనా.?
Chiranjeevi : పేరుకే ఆయన వామపక్ష భావ జాలం వుందని చెబుతుంటారు. కానీ, నరనరాన టీడీపీ భావజాలం నిండిపోయింది ఆయనలో. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిదీ, సీపీఐ నేత నారాయణదీ ఒకే సామాజిక వర్గం. అందుకే, ఆ కోణంలోనే నారాయణ, రాజకీయాలు చేస్తుంటారు. పైకి, తరచూ చంద్రబాబుతో విభేదిస్తున్నట్లు కనిపిస్తారేగానీ, ఆయన లోలోపల చంద్రబాబు పట్ల అమితమైన భక్తిని కలిగి వుంటారు.సినీ నటుడు, మాజీ కేంద మంత్రి చిరంజీవిపై ఇటీవల సీపీఐ నారాయణ చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో, రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది.
కారణం లేకుండా చిరంజీవిని నారాయణ ఎందుకు రాజకీయాల్లోకి లాగారన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చిరంజీవి లైట్ తీసుకున్నా, చిరంజీవి అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం కులం కోణంలోనే నారాయణ, చిరంజీవిపై అసందర్భ ప్రేలాపనలు పేలారన్నది చిరంజీవి అభిమానుల ఆరోపణ. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు కూడా. సూపర్ స్టార్ కృష్ణని అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు పిలవకపోతే, కేంద్రంపైనో రాష్ట్రంపైనో.. ఇవేవీ కాదంటే, ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకుల్నో నారాయణ ప్రశ్నించి వుండాలి.నిజానికి, విగ్రహావిష్కరణ విషయాన్ని ఆ తర్వాత చాలామంది మర్చిపోయారు.
ఆ విషయమై నారాయణ ఎందుకు తీరిగ్గా రాజకీయం చేశారు.? అన్నదే అసలు చర్చ. చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేస్తారేమోనన్న అనుమానంతోనే నారాయణ, చిరంజీవిని టార్గెట్ చేశారన్న వాదన లేకపోలేదు. నారాయణ అంతలా భయపడాల్సిన పనిలేదు, చిరంజీవి రాజకీయాల్లోకి రారు.చిరంజీవి, రాజకీయాల్లోకి వస్తే.. నష్టపోయేది టీడీపీ. అది నారాయణకి బాగా తెలుసు. అందుకే, చంద్రబాబుకి రాజకీయంగా నష్టం కలుగుతుందేమోనని నారాయన భయపడినట్టున్నారు. మరీ ఇంతటి కులభిమానమా.? అన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ.