Modi 3.0 Cabinet : మోడీ కేబినెట్ మంత్రుల‌ ఫుల్‌ లిస్ట్ ఇదే… ఏ రాష్ట్రం నుంచి ఎవ‌రెవరంటే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Modi 3.0 Cabinet : మోడీ కేబినెట్ మంత్రుల‌ ఫుల్‌ లిస్ట్ ఇదే… ఏ రాష్ట్రం నుంచి ఎవ‌రెవరంటే..!

Modi 3.0 Cabinet : ముచ్చ‌ట‌గా మూడోసారి మోదీ ప్ర‌ధాని ప‌ద‌వి అధిరోహించ‌బోతున్నారు. మోదీ ప్ర‌ధాని అయ్యాక ఆయ‌న కేబినేట్‌లో ఎవ‌రెవ‌రు స్థానం ద‌క్కించుకోబోతున్నారు అనే సస్పెన్స్ నెల‌కొని ఉండ‌గా, దానిపై ఒక క్లారిటీ వ‌చ్చింది. మోదీతో పాటు తొలి విడతలో 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గంలో 78 నుంచి 81 మందికి అవకాశం ఉన్నా.. ప్రస్తుతం 50 మంది వరకూ తీసుకున్నట్టు స‌మాచారం. కేబినెట్‌లో బీజేపీ నుంచి అమిత్‌ […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 June 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Modi 3.0 Cabinet : మోడీ కేబినెట్ మంత్రుల‌ ఫుల్‌ లిస్ట్ ఇదే... ఏ రాష్ట్రం నుంచి ఎవ‌రెవరంటే..!

Modi 3.0 Cabinet : ముచ్చ‌ట‌గా మూడోసారి మోదీ ప్ర‌ధాని ప‌ద‌వి అధిరోహించ‌బోతున్నారు. మోదీ ప్ర‌ధాని అయ్యాక ఆయ‌న కేబినేట్‌లో ఎవ‌రెవ‌రు స్థానం ద‌క్కించుకోబోతున్నారు అనే సస్పెన్స్ నెల‌కొని ఉండ‌గా, దానిపై ఒక క్లారిటీ వ‌చ్చింది. మోదీతో పాటు తొలి విడతలో 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గంలో 78 నుంచి 81 మందికి అవకాశం ఉన్నా.. ప్రస్తుతం 50 మంది వరకూ తీసుకున్నట్టు స‌మాచారం. కేబినెట్‌లో బీజేపీ నుంచి అమిత్‌ షా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్‌, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా, హరదీప్ సింగ్ పూరి, అశ్విని వైష్ణవ్, మనుసుఖ్ మాండవీయా, పియూష్ గోయల్, కిరణ్ రిజుజులు, గజేంద్రసింగ్ షెకావత్, శోభా కరద్లాంజే, గిరిరాజ్ సింగ్, క్యాబినెట్‌‌లో కొనసాగనున్నారు.

Modi 3.0 Cabinet : మంత్రులు వీరే..

లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్, బసవరాజ్‌ బొమ్మై, మనోహర్‌లాల్‌ ఖట్టర్, సర్బానంద సోనోవాల్‌లతో పాటు త్రిసూర్ బీజేపీ ఎంపీ సురేశ్ గోపి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైలకు మంత్రివర్గంలో చోటు లభించింది. వీరితో పాటు మిత్రపక్షాలకు చెందిన ఎంపీలకు చోటుదక్కింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్‌ బెర్త్‌ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు.

Modi 30 Cabinet మోడీ కేబినెట్ మంత్రుల‌ ఫుల్‌ లిస్ట్ ఇదే ఏ రాష్ట్రం నుంచి ఎవ‌రెవరంటే

Modi 3.0 Cabinet : మోడీ కేబినెట్ మంత్రుల‌ ఫుల్‌ లిస్ట్ ఇదే… ఏ రాష్ట్రం నుంచి ఎవ‌రెవరంటే..!

శ్రీకాకుళం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన ఎంపీ రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ హోదా.. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ను సహాయ మంత్రి పదవి వరించింది.వీరందరు సాయంత్రం రాష్ట్రపతి భవన్‎లో జరిగే ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎవరికి ఏ శాఖలు వరించాయన్న దానిపై స్పష్టత రావల్సి ఉంది.ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం మాల్దీవ్స్ అధ్యక్షుడు మయిజ్జు ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు.. మారిషస్ ప్రెసిడెంట్ ప్రవింద్ జుగ్నౌథ్ కూడా ఢిల్లీకి వచ్చారు. భారత సంప్రదాయం ప్రకారం వీరికి స్వాగతం పలికారు. సాయంత్రం ప్రధాని ప్రమాణస్వీకారంలో వీరు పాల్గొంటారు. ప్రమాణ స్వీకారానికి ముందు జాతీయ నేతలకు నివాళి అర్పించారు

No liveblog updates yet.

LIVE UPDATES

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది