KCR : జాతీయ రాజకీయం.! కేసీఆర్‌కి అడ్డంకి అదొక్కటే.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : జాతీయ రాజకీయం.! కేసీఆర్‌కి అడ్డంకి అదొక్కటే.!

 Authored By prabhas | The Telugu News | Updated on :21 June 2022,7:00 am

KCR : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గతంలో తన కుమార్తె కవితను పార్లమెంటుకు పంపారు. అలా కవితను పార్లమెంటుకు కేసీయార్ పంపడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే వుంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అనువైన పరిస్థితుల్ని కల్పించడం కోసం వ్యూహాత్మకంగా కేసీయార్, ఆ అడుగు వేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇందులో నిజమెంత.? అంటే, అది వేరే చర్చ. కానీ, కేసీయార్ వ్యూహాలు ఇలాగే వుంటాయ్. కానీ, ఎందుకోస ఢిల్లీ స్థాయిలో కేసీయార్ వ్యూహాలు పెద్దగా సత్ఫలితాలనివ్వడంలేదు. దేశం గతిని మార్చేస్తా.. కొత్త శకానికి నాంది పలుకుతా..

అని కేసీయార్ అనడాన్ని తప్పుపట్టలేం. ఈ దేశంలో ఏ పౌరుడైనాసరే, ఆ ఆలోచన చేయొచ్చు. ఓ ముఖ్యమంత్రి, గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం వున్న వ్యక్తి, దేశ రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకొస్తానంటే తప్పుపట్టగలమా.? కానీ, తెలంగాణ రాజకీయం వేరు, దేశ రాజకీయం వేరు. తెలుగు రాష్ట్రాలే రాజకీయంగా ఒక్కటయ్యే పరిస్థితి లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రాజకీయ పంచాయితీ కారణంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేరుపడ్డాయి. అలా వేరుపడటానికి కారణం కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ ఇంకా కొనసాగుతూనే వుంది.

National Politics Biggest Hurdle For KCR

National Politics, Biggest Hurdle For KCR

ఇక్కడ ఈ పంచాయితీ తేల్చుకోకుండా, దేశంలో రాజకీయం చేస్తామంటే ఎలా.? ఆ సంగతి పక్కన పెడితే, కేసీయార్ జాతీయ రాజకీయాల వైపు దృష్టిపెట్టినప్పుడు, తెలంగాణలో గులాబీ రాజకీయం చేసేదెవరు.? ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న మళ్ళీ. కేసీయార్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే, తెలంగాణలో గులాబీ రాజకీయం ఇప్పుడున్న పద్ధతిలో నడుస్తుంది. రేప్పొద్దున్న ఆ ఈక్వేషన్ మారితే, తెలంగాణలోనే గులాబీ పార్టీ గల్లంతవ్వొచ్చు. ఇదే కేసీయార్ ముందున్న అతి పెద్ద సమస్య. సో, జాతీయ రాజకీయాల్లో చక్రంత తప్పుడు అంత ఈజీ కాదని కేసీయార్ ఈపాటికే అర్థం చేసుకుని వుండాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది