NCCF Jobs : 12th అర్హతతో నేషనల్ కోఆపరేటివ్ లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NCCF Jobs : 12th అర్హతతో నేషనల్ కోఆపరేటివ్ లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు…!

 Authored By ramu | The Telugu News | Updated on :13 November 2024,5:15 pm

ప్రధానాంశాలు:

  •  NCCF Jobs : 12th అర్హతతో నేషనల్ కోఆపరేటివ్ లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు...!

NCCF Jobs : నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ప్రధాన కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. ఎన్.సి.సి.ఎఫ్ ఢిల్లీ, నోయిడా బ్రాంచ్ లలో ఈ జాబ్స్ ఉన్నాయి. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఈ సంస్థ లో ఈ ఉద్యోగాలు కేవలం కాంట్రాక్ట్ ప్రాతిపదీకన మాత్రమే ఉన్నాయి.

NCCF Jobs ఖాళీగా ఉన్న పోస్టులు

చార్టెడ్ అకౌంటెంట్

పన్ను సలహాదారు

అసిస్టెంట్ మేనేజర్

ఫీల్డ్ ఆఫీసర్

అకౌంటెంట్

ఆఫీస్ అటెండెంట్

వీటికి కావాల్సిన విద్యార్హతలు :

చార్టెడ్ అకౌంటెంట్ : ఐ.సి.ఏ.ఐ, ఐ.ఐ.ఎం, ఎస్.ఆర్.సి.సి, లాంటి ప్రముఖ సంస్థల నుంచి ఉత్తీర్ణత ఐదేళ్ల అనుభవంతో చార్టెడ్ అకౌంటెంట్ డిగ్రీ కలిగి ఉండాలి.

పన్ను సలహాదారు : దీనికి కూడా పన్ను వ్యాపార సంబంధిత సేవలలో దాదాపు 3 సంవత్సరాల అనుభవంతో పాటు సీ.ఏ డిగ్రీ కలిగి ఉండాలి.

అసిస్టెంట్ మేనేజర్ : ఎం.బి.ఏ/పి.జి.డి.ఎం/మాస్టర్స్ హెచ్.ఆర్/పబ్లిక్ పాలసీలో దాదాపు 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

ఆఫీసర్ : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ఎం.బి.ఏ/పి.జి.డి.ఎం/మాస్టర్స్ కలిగి 2 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి.

అకౌంటెంట్ : ఎం.కాం/సీ.ఏ ఇంటర్, ఎం.బి.ఏ/పి.జి.డి.ఎం/గ్రాడ్యుయేషన్ ఫైనాన్స్/అకౌంట్స్/కామర్స్‌లో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

ఆఫీస్ అటెండెంట్ : ఢిల్లీ స్టేట్ ప్రభుత్వ విధానాలు పాటించాల్సి ఉంటుంది.

NCCF Jobs ఖాళీలు :

చార్టెడ్ అకౌంటెంట్: 02

పన్ను సలహాదారు: 01

అసిస్టెంట్ మేనేజర్: 02

ఫీల్డ్ ఆఫీసర్: 01

అకౌంటెంట్: 02

ఆఫీస్ అటెండెంట్: 02

వయస్సు :

చార్టెడ్ అకౌంటెంట్, పన్ను సలహాదారు, అసిస్టెంట్ మేనేజర్, అకౌంటెంట్, ఆఫీస్ అటెండెంట్ అన్నిటికీ గరిష్టంగా 40 సంవత్సరాలు.

ఫీల్డ్ ఆఫీసర్: గరిష్టంగా 35 సంవత్సరాలు.

NCCF Jobs 12th అర్హతతో నేషనల్ కోఆపరేటివ్ లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు

NCCF Jobs : 12th అర్హతతో నేషనల్ కోఆపరేటివ్ లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు…!

దరఖాస్తు ఎలా చేసుకోవాలి :

అర్హతలను కలిగి ఉన్న అభ్యర్థులు తమ పూర్తి వివరణలతో కూడిన సీవీని, కవర్ లెటర్‌తో పాటు, ఇ-మెయిల్ ద్వారా admincell@ncef-india.comకు పంపాలి.
దరఖాస్తులు పంపే చివరి తేదీ 20 నవంబర్, 2024, సాయంత్రం 6:00 గంటలలోపుగా ఉండాలి.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది