Anandayya : ఒమిక్రాన్ కు మందు రెడీ చేసిన నెల్లూరు ఆనందయ్య.. వైరల్ న్యూస్..!
Anandayya : ఒమిక్రాన్.. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవర పెడుతోన్న కొత్త కరోనా వేరియంట్. ఉన్న వేరియంట్లతోనే గజ గజ వణికి పోతూ ఉంటే మరో కొత్త మహమ్మారి వేగంగా దూసుకు వస్తోంది. ఒమిక్రాన్ కు ఇంకా అధికారంగా ఏ మందు రెడీ కాక అందరూ అయోమయంలో ఉన్న ఈ సమయంలో ఓ బ్రేకింగ్ వార్త వినబడింది. ఒమిక్రాన్ ను కట్టడి చేసేందుకు తన వద్ద మందు సిద్ధంగా ఉందని నెల్లూరు ఆనందయ్య సంచలనం సృష్టించారు. ఒమిక్రాన్ మందుపై అనందయ్య ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ బైట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.తాను గతంలో తయారుచేసిన మందు లాగే.. అందులో వాడే మూలికలతో పాటు మరికొన్ని వేరే మూలికలను వాటిని జోడించి ఈ మందును తయారుచేశామని అనందయ్య తెలిపారు.
ఈ తాజా మందు ఒమిక్రాన్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా దూసుకు వెళ్తుం. రోజురోజుకు కేసులు భారీగా నమోదు అవుతుండటంతో ఆనందయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా తాను తయారు చేసిన ఒమిక్రాన్ మందును పేదలందరికీ ఉచితంగా అందిస్తామని ఆనందయ్య ప్రకటించారు. అయితే ఆ మందు వల్ల ఎలాంటి దుష్ర్పభవాలు కలగవని ఆయన స్పష్టం చేశారు.

Nellore Anandayya Ready to omikran medicine
Anandayya : ఒమిక్రాన్ కు మందు రెడీ..!
నెల్లూరు ఆనందయ్య కరోనా రెండో దశ పీక్ లో ఉన్న సమయంలో మహమ్మారికి మందు కనిపెట్టాను అని చెప్పడం.. అది తీసుకుంటే వ్యాధి నయమవుతోందనే వార్తలు రావడం అప్పట్లో దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ఏపీ ప్రభుత్వం తో పాటు ఇండియన్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైతం అనందయ్య పరిశోధనకు అడ్డు చెప్పక పోవడం తో ఆయన మందుకు తెగ డిమాండ్ పెరిగింది. ఇప్పటికే అనందయ్య మందు వల్లే తాము బతికి భూమి మీద ఉన్నామని చెప్పేవారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఉన్నారు.