
Ys Jagan
ఏపీ ప్రభుత్వంకు రెడ్డి సామాజిక వర్గంతో సమస్య ఏంటా అనుకుంటున్నారా. సీఎం రెడ్డి అయినా కూడా నెల్లూరు రెడ్డి సామాజిక వర్గంకు న్యాయం దక్కడం లేదట. వారికి సరైన ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వడం లేదట. దాంతో నెల్లూరు రెడ్లు చాలా కోపంతో ఉన్నారు. నెల్లూరులో ఉన్న ఇద్దరు ముఖ్య నాయకులు కూడా రెడ్డి సామాజిక వర్గంకు చెందిన వారే. వారు ఇద్దరు కూడా ప్రస్తుతం వైకాపా లో ఉంటున్నా కూడా జగన్ కు దూరంగా ఉంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో వారికి సంబంధించిన సహకారం చాలా అవసరం. కాని వారు మాత్రం దూరంగా ఉంటున్న కారణంగా ఉప ఎన్నికల్లో మెజార్టీకి భారీ గండి పడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నెల్లూరు లో మంత్రి పదవులు కావాలని ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. కాని ఇప్పటి వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఎలాంటి సానుకూల స్పందన దక్కలేదు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సమయంలో నెల్లూరు రెడ్డి సామాజిక వర్గంకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి మరియు కాకాని గోవర్ధన్ రెడ్డి కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. సీనియర్ లు అయిన వీరిద్దరిపై అదే జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో ఆయన కు పోటీగా వీరు కూడా మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు.
Ys jagan
నెల్లూరు జిల్లాలోని కీలక నియోజక వర్గాలు తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. కనుక వాటి నుండి ఓట్లు జారిపోకుండా ఉండేందుకు గాను స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రంగంలోకి దిగాడు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటలను వారికి చెప్పి ఎన్నికల్లో సహకరించాలని కోరాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పకుండా అండగా ఉంటాడు. జగన్ మోహన్ రెడ్డి తప్పకుండా మీకు పదవులు ఇస్తాడని హామీ ఇచ్చాడట. మరి తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ రెడ్డి సామాజిక వర్గంకు చెందిన ఎమ్మెల్యేలు మరియు నాయకులు ఎంత వరకు సహకరిస్తారు అనేది చూడాలి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.