నెటిజ‌న్ల టాక్ : బాబును తర్వాత విమర్శించవచ్చు.. మొదట మమ్ముల కాపాడండి మంత్రి గారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

నెటిజ‌న్ల టాక్ : బాబును తర్వాత విమర్శించవచ్చు.. మొదట మమ్ముల కాపాడండి మంత్రి గారు..!

 Authored By himanshi | The Telugu News | Updated on :7 May 2021,3:25 pm

perni nani ఏపీలో కరోనా కేసులు విపరీంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటీ అంటూ చంద్రబాబు నాయుడు సహా తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్‌ వేశాడు. చంద్రబాబు నాయుడును తీరును తప్పుబడుతూ మంత్రి చేసిన విమర్శలు చర్చనీయాంశం అవుతున్నాయి. మీరు అధికారం నుండి దిగి పోయిన సమయంలో ఆరోగ్య శాఖ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా. మీరు ఒక్క వైరాలజీ ల్యాబ్‌ లను కూడా ఏర్పాటు చేయలేక పోయారు. మేము కరోనా బాధితులకు సింగపూర్‌ నుండి ఆక్సీజన్ ను తెప్పిస్తున్నాము అన్నాడు.

perni nani : పని చేయండి మంత్రి గారు..

ఏపీ మంత్రి పేర్ని నాని perni nani కరోనా కేసుల విషయంలో ఎవరు విమర్శలు చేస్తే వారికి కౌంటర్‌ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప ఆయన ఏమాత్రం కరోనా పట్ల శ్రద్దను కనబర్చడం లేదు. దేశ వ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదు అవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా భారీగా ఉంది. అలాగే ఏపీలో కూడా మృతుల సంఖ్య భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు మరియు చర్యలు తీసుకోవడం లేదని, ముందుగా ఆ పనులు చేసి ఆ తర్వాత విపక్షాలను విమర్శించాలంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

netizens fire on perni nani

netizens fire on perni nani

రాష్ట్రంలో కరోనా పరిస్థితి…

రాష్ట్రంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నట్లుగా మంత్రి చెబుతున్నారు. ఇన్ని కేసులు నమోదు అవుతూ ఉంటే అదుపులో ఉన్నట్లుగా ఎలా చెబుతారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వ్యాక్సిన్‌ విషయంలో మరియు ముందస్తు చర్యల విషయంలో హైకోర్టు నుండి చివాట్లు వచ్చాయి అంటే మీరు ఎలాంటి పరిపాలన కొనసాగిస్తున్నారో మీకు అయినా అర్థం అవుతుందా అంటూ నెటిజన్స్ మంత్రితో పాటు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంటే మీరు మాత్రం విపక్షాలకు కౌంటర్ ఇచ్చే పనిలో ఉన్నారా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది