Whatsapp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఫుల్ ఖుషీ అవుతున్న యూజర్లు
Whatsapp : వాట్సప్.. ప్రస్తుతం అనేక మందికి పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచంలో ఉన్న చాలా మందికి వాట్సాప్ తెలుసు. ఈ యాప్ వాడకం కూడా చాలా మంది చేస్తున్నారు. ఈ యాప్ లో వచ్చే ఫీచర్లు చాలా అప్డేట్ గా ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త, కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఈ సంస్థ చాలా మందిని అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఈ మెసేజింగ్ యాప్ లో ఎన్నో రకాల ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లతో పాటుగా మరో కొత్త ఫీచర్ ను ఈ సంస్థ తీసుకొచ్చేందుకు చూస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ప్రస్తుతం వాట్సాప్ లో అనేక గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రూపు నుంచి ఎవరైనా మెంబర్ ఎక్సిట్ అయితే గ్రూపులో ఉన్న వారందరికీ మెస్సేజ్ కనిపిస్తోంది.గ్రూపులోని ఎవరైనా సభ్యుడు ఎక్సిట్ అయితే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ వస్తుంది. కానీ ప్రస్తుతం ఈ ఫీచర్ ను వాట్సాప్ తొలగించాలని చూస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఫీచర్ ను ఇక నుంచి కనిపించకుండా చేయాలని వాట్సాప్ యోచిస్తోందట. ఇలా ఎవరైనా గ్రూపు సభ్యులు ఎక్సిట్ అయితే కేవలం గ్రూప్ అడ్మిన్ కు మాత్రమే మెస్సేజ్ వెళ్లేలా వాట్సాప్ చూస్తోందట.
Whatsapp : ఆ మెస్సేజుకు స్వస్తి పలికిన వాట్సాప్
ఇలా ఈ ఫీచర్ ను యాడ్ చేయడం ద్వారా ఎవరైనా గ్రూపు నుంచి ఎక్సిట్ కావాలనుకునే సభ్యులకు చాలా సులభం అవుతుందని వాట్సాప్ యోచిస్తోంది. ప్రస్తుతం కొంత మంది గ్రూపు నుంచి ఎక్సిట్ కావాలని అనుకున్నా కానీ గ్రూపులో ఉన్న ఇతర సభ్యులకు తెలిసి పోతుందని మొహమాటంతో గ్రూపులో ఉంటున్నారు. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే అందరికీ ఈజీ కానుంది. నచ్చని వారు ఈజీగా గ్రూపు నుంచి ఎక్సిట్ అయ్యే సౌలభ్యం కలగనుంది.