Redmi 10 : రెడ్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ రూ.10 వేలకే.. ఫీచర్స్ సైతం అదుర్స్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Redmi 10 : రెడ్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ రూ.10 వేలకే.. ఫీచర్స్ సైతం అదుర్స్..

Redmi 10 : మొబైల్ ప్రియులను ఆకట్టుకునేందుకు మొబైల్ తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇక తాజాగా రెడ్ మీ ఇండియన్ మార్కెట్ లోకి రెడ్ 10 మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో వారం రోజుల్లో ఇది ఫ్లిప్ కార్డు తో పాటు ఎమ్‌ఐ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో 6.71 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే తో పాటుగా కార్నింగ్‌ గొరిల్లా గ్రాస్‌ 3 ప్రొటెక్షన్‌ను […]

 Authored By mallesh | The Telugu News | Updated on :18 March 2022,10:00 pm

Redmi 10 : మొబైల్ ప్రియులను ఆకట్టుకునేందుకు మొబైల్ తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇక తాజాగా రెడ్ మీ ఇండియన్ మార్కెట్ లోకి రెడ్ 10 మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో వారం రోజుల్లో ఇది ఫ్లిప్ కార్డు తో పాటు ఎమ్‌ఐ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో 6.71 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే తో పాటుగా కార్నింగ్‌ గొరిల్లా గ్రాస్‌ 3 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. స్నాప్‌ డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌ తో ఫోన్ రన్ అవుతుంది.

ఈ ఫోన్‌లో రామ్‌ బూస్టర్‌ను సైతం అందించారు. దీంతో కెపాసిటీని 2జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ మోడల్ లో కెమెరాకు ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరా తో పాటుగా సెల్ఫీ కోసం 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 10 వాట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసేలా 6వేల ఎంఏహెచ్‌ బ్యాటరీ కూడా అందించారు.ఇక ఈ మోడల్స్ ధర విషయానికి వస్తే 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ కలిగిన ఫోన్‌ రూ. 9,999కి అందుబాటులోకి రానుంది. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఉన్న మోడల్ రూ.11,999కి అందించనున్నారు.

new models of redmi10 phone in the market

new models of redmi10 phone in the market

Redmi 10 : రూ.9,999 నుంచి ప్రారంభం

ఈ స్మార్ట్‌‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వర్క్ చేస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ చాలా తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుండటంతో వీటికి డిమాండ్ ఏర్పడే చాన్స్ ఉంది. స్నాప్‌ డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌ తో ఫోన్ రన్ అవుతుండటంతో చాలా మంది దీనిని ఎక్కువగా ప్రిఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటికి తోడు మరిన్ని మోడల్స్ త్వరలోనే మార్కెట్ లోకి వచ్చే చాన్స్ ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది