బ్రేకింగ్: తెలంగాణలో పాక్షిక లాక్ డౌన్.. ఇవే నిబంధనలు
telangana night curfeaw : దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తో లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ సమయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం పై రాష్ట్ర హై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆంక్షలు విధించాలంటూ కోర్టు సూచించినా కూడా పట్టించుకోక పోవడంతో హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న కోర్టు ప్రభుత్వం పై చాలా సీరియస్ అవ్వడంతో నేడు వెంటనే ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఎలాంటి నిబంధనలు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే కొనసాగబోతున్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
telangana night curfeaw నైట్ కర్ఫ్యూకు వీటికి మినహాయింపు..
గత ఏడాది లాక్ డౌన్ సమయంలో అన్ని వర్గాల వారికి కూడా కఠినంగా నిబంధనలు అమలు చేశారు. కాని ఈసారి మాత్రం కర్ప్యూ నుండి మీడియా వారికి, డెలవరీ బాయ్స్ ఇంకా కొన్ని ముఖ్యమైన విభాలకు ఉపశమనం కలిగించారు. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవడంతో పాటు నైట్ షోలు పూర్తిగా రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు చెందిన అత్యవసర విభాగాలు తప్ప ఇతర విభాగాల్లో నైట్ కన్ఫ్యూను ( telangana night curfeaw ) కఠినంగా అమలు చేయాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది.
telangana night curfeaw : హైకోర్టు ఆదేశాలతో..
హైకోర్టు ఆదేశాల కారనంగానే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ఈ జీవోను తీసుకు వచ్చింది. నేడు( telangana night curfeaw ) కర్ఫ్యూ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోకుంటే రేపు కోర్టు స్వయంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటుందని నిన్నటి వాదనల సందర్బంగా జడ్జ్ పేర్కొన్నారు. అందుకే వెంటనే తెలంగాణలో ఆంక్షలను అమలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయమై ప్రభుత్వం భిన్న వాదన కలిగి ఉంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య ఈ ఆంక్షల వల్ల తగ్గదు అనేది కొందరి వాదన. అందుకే ఆలస్యంగా ఆంక్షలు తీసుకు వస్తున్నట్లుగా వారు చెబుతున్నారు.