Karthika Deepam : రోజూ ఉదయం లేవగానే అది కంపల్సరీ.. గుట్టు విప్పిన డాక్టర్ బాబు భార్య | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam : రోజూ ఉదయం లేవగానే అది కంపల్సరీ.. గుట్టు విప్పిన డాక్టర్ బాబు భార్య

 Authored By prabhas | The Telugu News | Updated on :17 November 2021,4:20 pm

Karthika Deepam :బుల్లితెరపై డాక్టర్  బాబు పాత్రలో నిరుపమ్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. నిరుపమ్ భార్యగా మంజులకు కూడా మంచి క్రేజ్ వచ్చేసింది. మంజుల కూడా బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించింది.   ఇప్పటికీ నటిస్తూనే ఉంది. మంజుల చెల్లి కీర్తి కూడా సీరియల్ నటి. అలా ఫ్యామిలీలో చాలా మంది నటీమణులున్నారు. అయితే మంజుల ఈ మధ్యబుల్లితెరపై కంటే.. సోషల్ మీడియాలో ఎక్కువ బిజీగా మారింది. యూట్యూబ్ ద్వారా ఆదాయం భారీగా వస్తోందని తెలియడంతో అందరూ అదే బాటను వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే మంజుల కూడా యూట్యూబ్   చానెల్ మొదలుపెట్టింది. కేవలం తన పేరు ఉంటే బ్రాండ్ సరిపోదని, నిరుపమ్‌ పేరును కూడా యాడ్ చేసింది. మంజుల నిరుపమ్ అంటూ యూట్యూబ్‌ చానెల్‌ను ప్రారంభించారు.   రెండు నెలల్లోనే ఓ స్థాయికి వెళ్లింది. లక్షల సబ్ స్క్రైబర్లు వచ్చారు.   ఒక్కో వీడియోకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.  ఎక్కువగా పర్సనల్ విషయాలను షేర్ చేస్తుండటంతో ఈ వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.

nirupam paritala wife manjula New video in youtube

nirupam paritala wife manjula New video in youtube

Karthika Deepam : కషాయం తాగుతానన్న మంజుల

తాజాగా తన ఇంట్లోని సీక్రెట్లు,ఉదయం లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకు చేసే పనులేంటి? అనేది మంజుల చూపించింది. ఈ క్రమంలో ఉదయం లేవగానే తాను చేసే పని ఏంటో మంజుల చెప్పింది. ఉదయం   లేవగానే బ్రెష్ చేసుకున్న   తరువాత కచ్చితంగా కషాయం తాగాల్సిందేనట. గత నాలుగేళ్లు అది అలవాటు చేసుకున్నారట. ..    తనతో పాటు తన అత్త గారు కూడా తాగుతారట. గానుగ ఆకులతో చేసిన ఆ కషాయం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పుకొచ్చింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది