Ap Politics : పాలిటిక్స్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి తర్వాత తెర మరుగైన కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. అందులో ఒకటి.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన డీకే ఆదికేశవులు నాయుడు గారి ఫ్యామిలీ. డీకే దంపతులు భౌతికంగా దూరం కావటంతో వాళ్ల కుటుంబాన్ని పట్టించుకునే పార్టీలు కరువయ్యాయి. సొంత పార్టీ తెలుగుదేశం గానీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ గానీ ఆ ఫ్యామిలీని దగ్గరికి తీయట్లేదు. దీంతో ఆదికేశవులు నాయుడి వారసుడు డీకే శ్రీనివాస్ ప్రస్తుతం కుటుంబ వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలకు క్రమంగా, శాశ్వతంగా దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ కథ కంచికి చేరినట్లేనని భావిస్తున్నారు. గత ఘన చరిత్రను ఒకసారి గుర్తుచేసుకుంటున్నారు.
ఇప్పుడంటే విజయ్ మాల్యా ఒక ఆర్థిక నేరస్థుడు గానీ గతంలో ఆయన గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్. అలాంటి పెద్ద పారిశ్రామికవేత్తకే డీకే ఆదికేశవులు నాయుడిని వ్యాపార గురువుగా పేర్కొనేవారు. డీకేకి ఆరోజుల్లో ఆ స్థాయిలో పలుకుబడి ఉండేది. లిక్కర్, రియల్ ఎస్టేట్, విద్య తదితర రంగాల్లో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. మొదట్లో కర్ణాటక రాజకీయాల్లోకి ప్రవేశించిన డీకే తర్వాత ఏపీ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారు. టీడీపీలో చిత్తూరు జిల్లా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఎంపీ అయ్యారు. అదే క్రమంలో పవర్ ఫుల్ టెంపుల్ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవీ ఆయన్ని వరించింది. అనంతరం డీకే సతీమణి సత్యప్రభ సైతం ఒక సారి ఎన్నికల్లో నెగ్గారు. అయితే వాళ్లిద్దరూ ఇప్పుడు మన మధ్య లేరు. ఆ లోటు ప్రభావం వాళ్ల కుమారుడిపై బాగా పడుతోంది.
డీకే శ్రీనివాస్ ని గత అసెంట్లీ ఎన్నికల్లోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేయిద్దామని అనుకున్నా చంద్రబాబు నాయుడి సలహాలు, ఆదేశాల ప్రకారం వెనక్కి తగ్గారని చెబుతారు. ఆ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో డీకే శ్రీనివాస్ జగన్ పార్టీ వైపు మొగ్గు చూపాడు. ఒకసారి ముఖ్యమంత్రిని కలిశారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ నుంచి ఇప్పటివరకూ పిలుపు రాలేదు. ఫలితంగా శ్రీనివాస్ తన వ్యాపారాలేవో తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అప్పటికైనా అతణ్ని ఏ పార్టీ అయినా గుర్తిస్తుందా లేదా అనేది చూడాలి. లేకపోతే డీకే కుటుంబ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అని డిసైడ్ కావాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.